వైరల్ : టర్కీ భూకంపాన్ని.. ముందుగానే కనిపెట్టిన పక్షులు?

praveen
ఇటీవల టర్కీ, సిరియా దేశాల లో సంభవించిన ఘోరమైన భూకంపం కారణం గా ఎంతలా ప్రాణనష్టం జరిగిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ భూకంపానికి సంబంధించిన వార్తలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ భూ ప్రకంపనలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా ప్రతి ఒక్కరి మనసును పిండేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఏకంగా ప్రకృతి పగ పట్టినట్లుగానే భూకంపం రూపం లో వచ్చి ఎంతో మందిని ప్రాణాలను గాల్లో కలిపేసింది.

 కాగా రెండు దేశాల్లో కూడా శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షిస్తున్న రెస్క్యూటిమ్ ఇప్పటివరకు 4,000 మందికి పైగా మృత దేహాలను వెలిక్కి తీసింది అన్న విషయం తెలిసిందే. అయితే టర్కి చరిత్ర లోనే ఇది భారీ భూకంపం గా అక్కడి అధికారులు చెబుతూ ఉన్నారు. ఇక మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉంది. అయితే ఎక్కడికక్కడ భూకంపం కారణం  గా కుప్ప కూలిపోయిన భవనాల శిథిలాల కింద మృతదేహాలు లభిస్తున్న నేపథ్యం లో ఇక ఆయా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి అని చెప్పాలి. అంతేకాదు భూకంపం సంభవించడానికి ముందు ఏం జరిగింది అన్న వీడియో లో కూడా వైరల్ గా మారి పోయాయి.

 అయితే ప్రకృతి విపత్తు ఏదైనా ముంచుకు వస్తుంది అంటే చాలు ముందుగా జంతువులు, పక్షులు లాంటివి ఈ విపత్తును ముందుగానే కనిపెడతాయని కొంతమంది నిపుణులు చెబుతూ ఉంటారు. ఇక ఇక్కడ టర్కీ,  సిరియా దేశాలలో భూకంపం రావడానికి ముందు ఇక పక్షులు ఈ భూకంపాన్ని ముందుగానే కనిపెట్టాయి అన్నది తెలుస్తుంది. ట్విటర్లో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. భూకంపానికి ముందు అర్ధరాత్రి పక్షులు అరుపులు సంచారానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది. ఇక ప్రకృతి విపత్తులను పక్షులు ముందుగానే పసిగడతాయి అన్నదానికి ఈ వీడియో నిదర్శనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: