తుపాకీతో యజమానిని కాల్చి చంపిన కుక్క.. ఎక్కడంటే?

praveen
ఇటీవల కాలంలో పెంపుడు జంతువులతో ఎంతోమంది గాఢమైన బంధాన్ని ఏర్పరుచుకుంటూ ఉన్నారు అని చెప్పాలి . కొంతమంది ఏకంగా పెంపుడు జంతువులని కుటుంబ సభ్యులలో ఒకరిలా చూస్తూ ఉంటే మరి కొంతమంది ఏకాంతాన్ని దూరం చేసుకునేందుకు ఇక తమకు తోడు ఉండేందుకు కుక్కను ప్రేమగా పెంచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అదే సమయంలో అటు పెంపుడు కుక్కలు కూడా తమ యజమానులు పట్ల అమితమైన విశ్వాసాన్ని కనబరుస్తూ ఉన్న ఘటనలు కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి.

 ఇక మరోవైపు ఇక కొంతమంది ఏకంగా పెంపుడు కుక్కల విషయంలో రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా అందరికీ ఆగ్రహం తెప్పిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ మాత్రం విచిత్రమైన ఘటన జరిగింది. ఏకంగా పెంపుడు కుక్క తన యజమానిని తుపాకీతో కాల్చి చంపింది. అదేంటి కుక్క యాజమానిపై దాడి చేసే చంపడం అంటే ఓకే గాని.. ఏకంగా తుపాకీతో కాల్చి చంపడం ఏంటి ఇదేదో విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా. అమెరికాలో ఇలాంటిదే జరిగింది.

 అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో విచితకు చెందిన 30 ఏళ్ల జోసెఫ్ ఆస్టిన్ స్మిత్ తన పెంపుడు కుక్కతో హంటింగ్ ట్రిప్ కు వెళ్ళాడు. ఈ క్రమంలోనే పెట్ డాగ్ను, గన్ ను పికప్ ట్రక్కులో వెనుక సీట్లో ఉంచాడు. అతను ముందు సీట్లో కూర్చున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా గన్ ఫై దూకింది కుక్క. దీంతో గన్ ట్రిగ్గర్ ను ఆ కుక్క తెలియకుండానే నొక్కేసింది. ఫలితంగా గన్ లో ఉన్న బుల్లెట్ దూసుకు వెళ్లి ముందు సీట్లో ఉన్న కుక్క యజమాని స్మిత్ బాడీలోకి చీల్చుకు వెళ్ళింది. దీంతో ఇక బుల్లెట్ గాయలతో సదరు వ్యక్తి స్పాట్ లోనే మరణించాడట. అయితే అమెరికాలో కాల్పులు సంబంధించిన ఘటనలు ఎక్కువ అవుతూ ఉండడంతో  ఇక ఈ ఘటనను పెద్దగా ఎవరు పట్టించుకోలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: