తాలిబన్ల అరాచకం.. అలా చేసినందుకు చేతులు నరికేసారు?
ఇలా ఆఫ్ఘనిస్తాన్ లో తాళిబన్ల అరాచక పాలన గురించి ఏదైనా విషయం వెలుగులోకి వచ్చిందంటే చాలు అది కాస్త ప్రతి ఒక్కరిని కూడా అవాక్కాయ్యేల చేస్తూ ఉంది. ఇక ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లో ఎలాంటి ఆకృత్యాలు జరుగుతున్నాయి అన్నదానికి ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఒక ఘటన నిదర్శనంగా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా దొంగతనం చేశారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ముందుగా న్యాయస్థానంలో హాజరు పరిచి ఆ తర్వాత కోర్టులు విధించిన శిక్ష ప్రకారం కొంతకాలం పాటు జైల్లో పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదల చేసి సవ్యంగా ఉండాలి అంటూ ఒక అవకాశాన్ని కల్పిస్తారు.
కానీ ఆఫ్ఘనిస్తాన్ లో తాళిబన్లు మాత్రం అలా చేయలేదు. ఏకంగా దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని సక్రమంగా విచారించకుండానే శిక్ష వేసేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా అందరి ముందే బహిరంగంగా ఇక ఇలా దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి చేతులను దారుణంగా నరికేసారూ అని చెప్పాలి. ఖాందహారులోని అహ్మద్ షాహి స్టేడియంలో ఈ ఘటన వెలుగు చూసింది. అదే సమయంలో ఇక ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరస్తులకు శిక్షగా అటు కొరడా దెబ్బలను కూడా విధించడం గమనార్హం.