ఏడాది గ్యాప్ తో పుట్టిన కవలలు.. నెటిజన్స్ షాక్?

praveen
సోషల్ మీడియా అనేది.. నేటి రోజుల్లో వింతలో విశేషాలకు చిరునామాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలో ఉండే మారుమూల  ప్రాంతాల్లో సైతం ఎంతో మంది స్మార్ట్ ఫోన్ లో సోషల్ మీడియా వినియోగిస్తున్నారు అని చెప్పాలి తద్వారా ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా కూడా నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నారని చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని వింతైన ఘటనలు గురించి తెలిసి ఆశ్చర్య పోవడం నేటిజన్ల వంతు అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇక  కొన్ని ఘటనల గురించి తెలిసిన తర్వాత నిజంగా ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు అని చెప్పాలి. సాధారణంగా కవల పిల్లలు అని ఎవరిని అంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఒకేసారి జన్మించిన వారిని కవల పిల్లలు అని అంటూ ఉంటారు. ఇక ఒకే డెలివరీలో కవల పిల్లలు జన్మిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.అయితే ఇక్కడ కవలపిల్లలుగా పుట్టిన వారు ఏకంగా రెండు సంవత్సరాల గ్యాప్ లో పుట్టడం ఎప్పుడైనా విన్నారా.

 అదేంటి ఇద్దరు చిన్నారుల మధ్య  సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పుడు వాళ్లు కవల పిల్లలు ఎలా అవుతారు అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇద్దరు చిన్నారులు మాత్రం సంవత్సరం గ్యాప్ లో కవల పిల్లలుగా మారారు. వేరువేరు సంవత్సరాల తేదీల్లో ఒక జంటకు కవలం పిల్లరు పుట్టారు. అమెరికాలోని టెక్సాస్ లో జరిగింది ఈ ఘటన. ఒక మహిళలకు 2022 డిసెంబర్ 31వ తేదీన రాత్రి 11:55 గంటలకు మొదటి కుమార్తె జన్మించింది. అయితే ఆ తర్వాత 2023 జనవరి 1న 12 :01 గంటలకు రెండో కుమార్తె పుట్టింది. ఇలా నిమిషాల వ్యవధిలో పుట్టిన కవల పిల్లలు అయినప్పటికీ వారి పుట్టినరోజు కు మాత్రం ఏకంగా ఏడాది గ్యాప్ ఉంది అని చెప్పాలి. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: