చెవి నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి.. స్కానింగ్ చేసి డాక్టర్లు షాక్?

praveen
సాధారణంగా డాక్టర్ల దగ్గరికి ఎప్పుడు చిత్ర విచిత్రమైన రోగాలతో బాధపడుతూ వారు వస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరైనా పేషెంట్ కి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు అది పేషంట్ కి  కొత్తగా అనిపిస్తుంది. కానీ డాక్టర్లకు మాత్రం ఇక అందరి పేషంట్స్ లాగానే ఇక కొత్తగా వ్యాధి వచ్చిన వారు కూడా కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు ఏకంగా సీనియర్ డాక్టర్లను సైతం అవాక్కయ్యేలా చేసే విధంగా విచిత్రమైన కేసులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇటీవల  కాలంలో ఇలాంటి తరహా కేసులు అయితే ఎక్కువయ్యాయి అని చెప్పాలి.

 ఏకంగా కడుపు నొప్పితో బాధపడుతున్న వారు డాక్టర్ల దగ్గరికి వెళ్లి చూపించుకోగా.. ఇక పరీక్షలు చేస్తే ఏకంగా కడుపులో ఇనుప వస్తువులు.  చెక్క వస్తువులు ఉండడం లేదా వెంట్రుకలతో కూడిన బంతులు ఉండటం లాంటివి గుర్తించి డాక్టర్లు షాక్ అవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇక ఇటీవల ఇలాంటి తరహా కఠిన వెలుగులోకి వచ్చింది. విపరీతమైన చెవి నొప్పి వస్తూ ఉండడంతో ఒక వ్యక్తి హాస్పిటల్ కి వెళ్లాడు. దురద రక్తస్రావంతో పాటు చెవి నొప్పి వస్తుంది అన్న విషయాన్ని డాక్టర్ కు తెలిపాడు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలోని వైద్యులు అతడి చెవికి పరీక్షలు నిర్వహించి ఒక్కసారిగా షాక్ అయ్యారు.

 ఎందుకంటే అతను చెవిలో మగ్గుట్ లు గూడుకట్టుకుని ఉన్నట్లు ఇక స్కానింగ్ లో గుర్తించారు డాక్టర్లు. అంతేకాదు ఇప్పటికే చెవిలోని కొంతమేర అవి తినేసి చేసినట్లు గమనించారు. దీంతో డాక్టర్లు వెంటనే ఆ చెవిని శుభ్రం చేసి లార్వా దశలో ఉన్న మగ్గుట్ పురుగులను బయటకు తీసేసారు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ప్రతి ఒక్కరు ఈ ఘటన గురించి తెలిసి షాక్ అవుతున్నారు అని చెప్పాలి. పోర్చుగల్ లో64 ఏళ్ల వ్యక్తికి ఇక ఇలాంటి అనుభవం ఎదురయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: