ఎలుకలు పట్టుకునే జాబ్.. రూ.1.38 కోట్ల సాలరీ?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటు లోకి వచ్చిన నేపథ్యం లో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఎంతో సులభం గా తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమం లోనే ఇలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు అయితే అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఏకంగా చిత్ర విచిత్రమైన ఉద్యోగాలకు ఏకంగా లక్షల జీతం చెల్లించడం లాంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది.

 అయితే ఇక్కడ జాబ్ ఆఫర్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ జాబ్ గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా నేను చేస్తానంటే నేను చేస్తానని పోటీపడే అవకాశం కూడా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ జాబ్ చేయడంలో మీరు ఎక్స్పర్ట్ అయి ఉంటారు. ఇప్పటికే ఇంట్లోఎన్నోసార్లు ఇలాంటి పని చేసి ఉంటారు. ఇంతకీ ఈ జాబ్ ఏంటో తెలుసా ఎలుకలను పట్టుకోవడం. అదేంటి ఎలుకలను పట్టుకోవడం కూడా ఒక జాబేన అని అనుకుంటున్నారు కదా. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఇలాంటి ఒక జాబ్ కి అదిరిపోయే శాలరీ ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు.

 యూఎస్ లోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఇక ఇలాంటి విచిత్రమైన జాబ్ ఆఫర్ ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చనియాంశంగా మారిపోయింది. ఎలుకలు పట్టేందుకు కొత్త పోస్టును సృష్టించారు.  ఇక ఈ ఉద్యోగికి వార్షిక వేతనం 1.38 కోట్లు ఇస్తామని ప్రకటించారు. న్యూయార్క్ నగరంలో కనికరం లేని ఎలుకలపై పోరాడే శక్తి మీకు ఉందా.. మీకు ఎలుకలను పట్టుకునే నైపుణ్యం ఉందా.. అయితే మీకోసం ఒక అదిరిపోయే జాబ్ రెడీగా ఉంది అంటూ ప్రకటన విడుదల చేయడంతో అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: