పంక్చర్ చేయటం కోసమే పుట్టాడేమో.. 8 దేశాలు తిరిగి?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రోజురోజుకు ఎన్నో చిత్ర విచిత్రమైన ఘటనలు వెలుగులోకి వస్తూ ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొన్ని కొన్ని ఘటనలు అయితే ఏకంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి రాగా ఇక ఈ విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత.

 ఇంతకీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన ఏంటో తెలుసా ఏకంగా ఒక వ్యక్తి కార్లను పంక్చర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక ఎంతలా అంటే ఇక అతని జీవిత లక్ష్యమే కార్లను పంక్చర్ చేయడం అన్నట్లుగా అతను వ్యవహరించాడు అని చెప్పాలి. సాధారణంగా ఆకతాయిలు అప్పుడప్పుడు ఇలా వాహనాలను పంక్చర్ చేయడం లాంటివి చేసి ఆనందాన్ని పొందుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి.

 అయితే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా కార్ టైర్లను పంక్చర్ చేయడం లక్ష్యంగా దాదాపు 8 దేశాల్లో తిరిగాడు. ఇలా 8 దేశాలు ఎనిమిది వందల కార్ల టైర్లను పంక్చర్ చేశాడు సదరు వ్యక్తి. వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు ఇలా వినూత్నంగా ఆలోచించాడు. యూఎస్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, స్వీడన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాల్లో తిరుగుతూ కార్లను పంచర్ చేశారు  ఏకంగా ఇప్పటివరకు అతని జీవితంలో 900 కార్ల టైర్లు పంక్చర్ చేశాడట. కార్ల కారణంగానే కర్బనా ఉద్గారాలు వెలబడుతున్నాయని.. అందుకే ఇందుకు నిరసనగా ఇలాంటి పని చేశాను అంటూ సందరు వ్యక్తి తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: