ఏంటి.. పుర్రె రూ. 162 కోట్లా వామ్మో?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక ప్రపంచ నలమూలల్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా ఉన్న చోటు నుంచి తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. ఎందుకంటే ఇక ఎక్కడో మారుమూలన జరిగిన విషయాలను కూడా ఎంతోమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇక అవికాస్త వైరల్ గా మారిపోవడం జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి లోన్ చేస్తూ ఉంటాయి.

 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా లక్షల సంవత్సరాల క్రితం మానవ మనుగడ లేని సమయంలో ఏకంగా డైనోసార్లు ఈ భూమి మీద ఉండేవి అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. అయితే డైనోసార్లు ఎలా ఉండేది అన్న విషయాన్ని మాత్రం జురాసిక్ పార్క్ అనే సినిమా చూస్తే అర్థమవుతూ ఉంటుంది. డైనోసార్ అని చెప్పగానే ఇక ఆ రూపురేఖలను జురాసిక్ పార్క్ సినిమా కారణంగా ప్రతి ఒక్కరు ఊహించుకోగలుగుతున్నారు. అది సరేగాని ఇప్పుడు డైనోసార్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారా..

 ఏకంగా ఇప్పుడు డైనోసార్ కి సంబంధించిన ఒక శరీర భాగం ఏకంగా 162 కోట్ల విలువ చేస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదేంటో కాదు ఏకంగా డైనోసార్ పుర్రె. షాక్ అవుతున్నారు కదా.. కానీ ఇది నిజమే. మెక్సికోలో 76 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన డైనోసార్ కు సంబంధించిన పుర్రె లభించింది. దీనిని డిసెంబర్ 9వ తేదీన న్యూయార్కులో సేల్ చేయబోతున్నారు అని సోతె బైస్ నిపుణులు తెలిపారు. ఆరడుగుల పొడవుతో 200 పౌండ్ల బరువు గల ఈ పుర్రె 162 కోట్లకు అమ్ముడు అవుతుందని నిపుణులు చెబుతూ ఉండడం గమనార్ధం. ఈ విషయం తెలిసి నేటిజెన్లు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: