ఓరి నాయనో : 88వ పెళ్లి చేసుకోబోతున్నాడు?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పాలి. తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని యువతీ యువకులు భావిస్తూ ఉంటారు. ఇక జీవితాంతం అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే అంతకంటే అదృష్టం ఇంకేమీ ఉండదు అని భావిస్తూ ఉంటారు. ఇష్టాలను గౌరవిస్తూ కష్టసుఖాల్లో అండగా నిలబడుతూ.. నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే భాగస్వామి దొరికితే ఇక జీవితం సార్థకం అయినట్లే అని అనుకుంటూ ఉంటారు. అందుకే పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవడానికి కాస్త ఎక్కువగానే సమయం తీసుకుంటూ ఉంటారు అని చెప్పాలి.

 ఇక ఇటీవల కాలంలో అయితే ప్రతి ఒకరు కూడా తమ పెళ్లి విషయంలో మరింత పక్కా ప్లానింగ్ తోనే ఉంటున్నారు. పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకునేందుకు తాహతకు మించి ఖర్చు పెడుతూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు అసలు పెళ్లి అనే బంధానికి విలువ ఇవ్వకుండా ఒకటి కాదు ఏకంగా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు అని చెప్పాలి. ఇప్పటివరకు ఒక వ్యక్తి రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకోవడం గురించి మాత్రమే అందరం విన్నాము.

 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా 88వ పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు  ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇండోనేషియా కు చెందిన ఖాన్ అనే 61 ఏళ్ల వ్యక్తి 88వ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే 87 పెళ్లిళ్లు చేసుకున్న ఆయన ప్లే బాయ్ కింగ్ అని పిలుస్తూ ఉంటారు అందరూ.  14 ఏళ్ల వయసులోనే తనకంటే రెండేళ్ల పెద్దదైన అమ్మాయిని పెళ్లాడాడు. ఇక రెండేళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చి తర్వాత నుంచి వరుసగా పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇక ఇప్పుడు 88వసారి తన మాజీ భార్యనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తన మీద ప్రేమతో తనకోసం తిరిగి వచ్చే మాజీ ప్రేయసిలను తిరస్కరించలేను అంటూ చెబుతున్నాడు సదరు వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: