చిన్నారులే ఆ కాకి టార్గెట్.. ఏం చేస్తుందో తెలుసా?

frame చిన్నారులే ఆ కాకి టార్గెట్.. ఏం చేస్తుందో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం క్షణాల వ్యవధిలోని అందరూ తెలుసుకోగలుగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన ఘటనలు వెలుగులోకి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి.  నిజంగా ఇలా కూడా జరుగుతుందా అని అలాంటి ఘటనల గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కాకికి సంబంధించిన వార్త కాస్త అందర్నీ షాక్ కి గురిచేస్తుంది.



 కాకికి సంబంధించి వార్త రావడమేంటి..  అయినా అందులో కొత్తగా ఏముంటుంది అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే మాత్రం కొత్తగా కాదు కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి సాధారణంగా తల్లి కాకులు కొన్ని కొన్ని సార్లు తమ పిల్లలకు అపాయం కలుగుతుంది అని భావిస్తే.. ఏకంగా పాముల పైన ఇతర పక్షుల పైన దాడి చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఏకంగా మనుషుల మీద కూడా దాడి చేసి వాటి ముక్కుతో పొడవడం లాంటివి చేస్తూ ఉండడం ఇప్పటివరకు చూసాము. తన పిల్లలకు అపాయం కలుగుతుందని భావిస్తే తన కళ్ళ ముందు ఎవరు కనిపించినా కూడా దాడి చేయడానికి వెనకాడదు కాకి.



 ఇక్కడ ఓ కాకి ఇలాంటిదే చేస్తుంది. అయితే అందరిపై దాడి చేయడం లేదు. కేవలం చిన్నారులను మాత్రమే టార్గెట్ చేసుకొని దాడి చేయడం మొదలుపెట్టింది. వినడానికి కాస్త వింతగా ఉన్న ఇది నిజంగానే జరిగింది  యూకే లోని యార్క్ షైర్ అనే గ్రామంలో ఒక కాకి చిన్నారులను టార్గెట్ చేస్తూ వారిపై దాడి చేస్తుంది. డెకర్ గా పిలిచే ఈ కాకి ఊరులోని పిల్లలందరినీ కూడా బయటకు రాకుండా చేస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కాకి ఇలా చేస్తూ ఉండడంతో గ్రామానికి ఏదో కీడు జరగబోతుంది అంటూ ఊరిని విడిచి వెళ్ళిపోతున్నారు కొంతమంది. మరి కొంతమంది అవన్నీ మూఢనమ్మకాలు అంటూ కొట్టి పారేస్తూ ఇక అదే ఊర్లో ఉంటూ ఉండటం గవనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Uk

సంబంధిత వార్తలు: