ప్రెగ్నెంట్ అని తెలిసిన 48 గంటల్లో.. మహిళ డెలివరీ?
ఇక ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ఇలా ఎలా సాధ్యమైందబ్బా అని ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతూ ఉంటారు. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా సరే గర్భం దాల్చిన మహిళ తొమ్మిది నెలల పాటు శిశువుని మోయాల్సి ఉంటుంది. ఇలా తొమ్మిది నెలలు గడిచిన తర్వాత ఇక బిడ్డకు జన్మనిస్తుంది గర్భిణీ మహిళ. ఒకవేళ తొమ్మిది నెలలకు ముందు బిడ్డకు జన్మనిచ్చిన శిశువు ఏదో ఒకలోపంతో పుడుతుందని వైద్యులకు కూడా చెబుతూ ఉంటారు.
అయితే కొన్ని కొన్ని సార్లు 9 నెలలకు ముందే ఇక గర్భం దాల్చిన మహిళ కాన్పు కావడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం విచిత్రమైన ఘటన జరిగింది. తాను గర్భవతిని అని తెలిసిన 48 గంటల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది మహిళ. అదేంటి అదేలా సాధ్యమైంది అని అవాక్కవుతున్నారు కదా.. ఇంతకీ ఏం జరిగిందంటే.. 24 ఏళ్ల స్టోవర్ అనే అమెరికన్ టీచర్ గా పని చేస్తుంది. అయితే ఇటీవల ఆమెకు తల తిరిగినట్లుగా వాంతి వచ్చినట్లుగా అనిపించింది. పని ఒత్తిడి వల్ల ఇలా జరిగి ఉంటుందని లైట్ తీసుకుంది. ఎందుకైనా మంచిదని ఇక వైద్యులను సంప్రదించింది. అయితే ఆమెకు ఆరు నెలల గర్భం ఉంది అన్నట్లుగా తేల్చారు వైద్యులు. అయితే అనారోగ్య కారణాలు తలెత్తడంతో వెంటనే ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు వైద్యులు. కాగా శిశువు పరిస్థితి ఎలా ఉందన్నది తెలియ రాలేదు.