
80ఏళ్లకు గిన్నిస్ రికార్డ్.. ఏకంగా విమానం లోంచి దూకి?
ప్రతి విషయంలో కూడా యువకులతో పోటీపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక 80 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఏదో సాధించాలని ఆశ పడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి కొంతమంది వృద్ధుల గురించే. 80 ఏళ్ల వయసులో కూడా యువకులు సైతం చేయడానికి భయపడే స్టంట్ చేసి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారూ . నేటి రోజుల్లో యువత ప్రయత్నించిన గిన్నిస్ బుక్ కొట్టలేక పోతున్నారు. కానీ సదరు వృద్ధులు మాత్రం రిస్కు చేసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారూ. ఇంతకీ ఇలా 80 ఏళ్ల వయసులో గిన్నిస్ బుక్ సాధించడానికి వాళ్ళు చేసిన స్టంట్ ఏంటో తెలుసా స్కై డైవ్.
ఏంటి 80 ఏళ్ల వయసులో స్కై డైవింగ్ చేశారా నిజమే చెబుతున్నారా అని అవాక్కవుతున్నారు కదా. ఇది నిజంగానే జరిగింది. జంపర్ ఓవర్ 80 సొసైటీ కి చెందిన 8 మంది అమెరికాలోని ఓవర్ లాండ్లో స్కై డైవ్ చేశారు. అయితే 80 ఏళ్ళు దాటిన వారిలో ఇంత మంది కలిసి ఒక స్కై డైవ్ ఫార్మేషన్ చేయడం ఇదే తొలిసారట. ఇప్పటివరకు ఆరుగురు కలిసి ఇలా స్కై డైవ్ చేసి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టిస్తే ఇక ఇప్పుడు.. 8 మంది వృద్ధులు 80 ఏళ్ల వయసులో స్కై డైవింగ్ చేసి సరికొత్త గిన్నిస్ రికార్డును నెలకొల్పారు అని చెప్పాలి.