
దారుణం : మాస్క్ పెట్టుకోమన్నందుకు.. చంపేశాడు?
కాగా ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మనుషుల్లో ఉండే ఓర్పు సహనం పూర్తిగా నశించిపోతుంది అన్నది అర్ధమవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న కారణాలతో ఏకంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మాస్కు పెట్టుకో అని సలహా ఇచ్చినందుకు ఏకంగా తుపాకీతో కాల్చి చంపేసాడు. ఈ ఘటన జర్మనీలో వెలుగుచూసింది.
ప్రస్తుతం జర్మనీలో వ్యాక్సినేషన్ ఉద్యమం ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అక్కడ ఉండేది ప్రజలందరూ కూడా మాస్కులు ధరించడం తప్పనిసరి. మరియు మారియో ఎన్ అనే వ్యక్తి ఒక బీరు ను కొనుగోలు చేసేందుకు పక్కనే ఉన్న స్టోర్ కి వెళ్ళాడు. మాస్కు ధరించి ఉన్నాడు. షాప్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మాస్క్ తీసి జేబులో పెట్టుకున్నాడు. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లగా.. అక్కడ పనిచేస్తున్న 20 ఏళ్ల విద్యార్థి మాస్క్ ధరించండి సార్ అంటూ అతనికి సూచించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన మారియో పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి పేల్చాడు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.