ఈ ప్రపంచంలో.. సంతోషంగా లేని దేశం ఏదో తెలుసా?

praveen
ప్రపంచ దేశాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే విషయంపై ఎప్పటికప్పుడు కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు నిర్వహించిన సర్వేలు కు సంబంధించిన రిపోర్టులను వెల్లడించిన సమయంలో అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇలాంటి సర్వేల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  ఇప్పుడు వరకు ఎన్నో రకాల విషయాలపై ప్రపంచ దేశాలలో సర్వే నిర్వహించగా.. సర్వేల ఫలితాలు హాట్ టాపిక్గా  మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో సంతోషంగా లేని దేశాలు ఏవి అనే విషయంపై ఇటీవలే సర్వే నిర్వహించగా ఒక ఆసక్తికర విషయం ఇటీవలే  సర్వే నివేదికలో వెల్లడయ్యింది. అందరూ అనుకుంటున్నట్లు గానే తాలిబన్ల పాలనలో క్షణం ఒక యుగం గా గడుపుతున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ప్రస్తుతం సంతోషంగా లేరు అన్న విషయం ఈ సర్వేలో వెల్లడైంది. ప్రపంచంలో సంతోషంగా లేని దేశాల  జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది అని చెప్పాలి. గలప్స్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఇండెక్స్ ప్రకారం ఇక ఈ విషయం బయటపడింది. దాదాపు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న 80 శాతం ప్రజలు అక్కడి పాలనతో కాస్త ఆందోళన లోనే మునిగిపోతున్నారట.

 అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న 74 శాతం మంది ప్రజలు ఇక ఆ దేశంలో బ్రతకడానికి తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారట. ఇక 61 శాతం మంది ప్రజలు ప్రశాంతత లేకుండా దిగులుగా ఉంటున్నారు  అన్న విషయం ఈ సర్వేలో వెల్లడైంది. అయితే ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుతం రోజురోజుకు పేదరికం పెరిగిపోతుండటం.. మరోవైపు నిరుద్యోగ సమస్య పెరిగి పోతూ ఉండటం కారణంగా కోపం ఆందోళన మొదలై వాటి వల్ల మానసిక ఒత్తిడి.. మానసిక సమస్యలను ఎదుర్కొనే వారి సంఖ్య అక్కడ పెరిగి పోతుంది అని ఈ సర్వే రిపోర్ట్ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: