కర్మ ఫలితం.. చైనాలో ఇలా ఎప్పుడూ జరగలేదట?

praveen
ప్రతి ఒక్కరూ ఎలాంటి తప్పు చేసిన కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుంది అని అంటూ ఉంటారు. ఇప్పుడు చైనా విషయంలో ఇదే నిజం అవుతుంది అన్నది తెలుస్తుంది. కరోనా వైరస్ అనే ఒక ప్రాణాంతకమైన మహమ్మారిని సృష్టించి ప్రపంచం మీదికి వదిలింది చైనా. అసలు రహస్యాలను దాచి పెట్టి అంతా పాకీపోయేలా చేసింది. చివరికి మారణహోమానికి కారణమైంది. ఎంతోమంది తమ ప్రియమైన వారిని కోల్పోయి అరణ్యరోదనగా విలపించారు అనే చెప్పాలి. ఇక ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దారుణమైన పరిస్థితులకు కారణమైన చైనా ఇప్పుడు కర్మ ఫలితం అనుభవిస్తోంద అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

 గత ఆరు దశాబ్దాలలో ఎప్పుడూ లేనంత కరువు ప్రస్తుతం చైనాలో కనిపిస్తుంది. సగం కి పైగా దేశం కరువుతో అల్లాడే పోతుంది. మొన్నటి వరకు  కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని అల్లాడిపోయిన చైనా ఇక ఇప్పుడు కరువుతో మరింత దీనస్థితిలోకి జారిపోతుంది. నదుల్లో నీటి మట్టం తగ్గిపోతుంది. ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద నది యాంగ్జీ. అయితే ఇది చైనాలో ఉన్న 40 కోట్ల మందికి పైగా తాగునీరు అందిస్తోంది. ఇప్పుడు మాత్రం వరద నీటిమట్టం తగ్గడంతో 600 ఏళ్ల నాటి బుద్ధుని ప్రతిమలు కూడా బయటపడుతున్నాయి. కేరళలో ఎప్పుడు చూడని స్థాయిలో అక్కడ ఎండలు మండిపోతున్నాయి.

 51 చిన్న నదులు, 21 జలాశయాలు పూర్తిగా ఎండిపోయాయి. నదులలో నీళ్లు లేకపోవడంతో జల విద్యుత్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ద్వారా హైడ్రో పవర్ ప్లాంట్లో ఉత్పత్తి కూడా పడిపోయింది. ఇక బొగ్గు కొరత కారణంగా ఇప్పటికే అక్కడ కరెంట్ సంక్షోభం ఏర్పడింది అన్న విషయం తెలిసిందే.  లక్షలమంది చీకట్లోనే బతికేస్తున్నారు. కరెంట్ సంక్షోభం నేపథ్యంలో ఫ్యాక్టరీల తో పాటు షాపింగ్ మాల్స్ ఆఫీస్ లు కూడా పనిచేయడం లేదు. దీంతో అక్కడ పంటలపై ఈ పరిస్థితులు ఎంతగానో ప్రభావం చూపుతున్నాయి. ఈ కరువు కారణంగా హుబై రాష్ట్రంలో 1.27 కోట్ల ఎకరాలు సించువాన్ ప్రాంతాల్లో లక్ష 16 వేల ఎకరాల్లో పంట నాశనమైంది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో తాగునీరు లేక జనాలు అల్లాడిపోతున్నారు. కరువు నుంచి ఎలా బయటపడాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: