ఒకేసారి 8 మందిని పెళ్లి చేసుకున్నాడు.. వారితో శృంగారం కోసం?

praveen
ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకున్న తర్వాత రెండో పెళ్లి ఆలోచన చేయాలి అంటేనే భయపడిపోతున్నారు. ఒక భార్యతోనే వేగటం చాలా కష్టం గా ఉంది. ఇక రెండో పెళ్లి చేసుకోవడమా బ్రతుకు మీద ఆశలులేని వాడే అలాంటి పని చేస్తాడు అని సమాధానం చెబుతున్నారు ఎంతోమంది. అంతేకాదండోయ్ ఒక్క పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఖర్చులు భరించడం కూడా అంతే కష్టంగా మారిపోతుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో కొంతమంది ఒకటి కాదు రెండు కాదు అంతకు మించి అన్ని రోజుల్లోనే పెళ్లిళ్లు చేసుకోవడం లాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి.  బ్రెజిల్ దేశానికి చెందిన ఆర్థర్ ఓ ఉర్సొ  అనే మోడల్ మాత్రం ఇలాంటి పని చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

 ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది మంది మహిళలను ఒకే ఫంక్షన్లో పెళ్లి చేసుకొని ప్రపంచవ్యాప్తంగా అతను హాట్ టాపిక్ గా మారిపోయాడు. అయితే తొమ్మిది మందిలో ఒకరు కొన్ని నెలల తరువాత అతనికి విడాకులు ఇవ్వడం గమనార్హం. అయితే సదరు విడాకులు ఇచ్చిన మహిళ తన భర్తను వేరొకరితో పంచుకోవడానికి ఇష్టపడలేదు అని తెలుస్తోంది. ఇప్పుడు విడాకులు ఇచ్చిన మహిళ గురించి ఆలోచించకుండా తనతోపాటు కలిసి ఉన్న 8 మంది భార్యలను సంతోషంగా చూసుకోవడం ఎలా అన్న దానిపై ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడట అతను.

 ఎనిమిది మంది భార్యల కోసం ఏడు వందల చదరపు అడుగుల ఇంటిని నిర్మిస్తూ ఉన్నాడు. అంతేకాదండోయ్ ఇక శృంగారం టైం కోసం.. భార్యలను శారీరకంగా సుఖపెట్టడం కోసం కూడా ఒక టైం టేబుల్ పెట్టుకున్నాడట. ఇక ఈ టైం టేబుల్ లో భాగంగా ఏ భార్యతో ఎంత టైం శృంగారం చేయాలనేది కూడా రాసి ఉందట. అయితే ఇదే విషయాన్ని అటు స్థానికులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే అతని దెయ్యం అని పిలవడం కూడా మొదలుపెట్టారు. వెంటనే ఇంటిని ఖాళీ చేయాలని అతని ఇంటి గోడలపై హెచ్చరికల రాయడం కూడా చేశారట. అయినప్పటికీ ఇవి పట్టించుకోని సదరు వ్యక్తి తన భార్యలను సంతోషంగా ఉంచడం పైనే దృష్టి పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: