కాటేసిన పాముపై.. ప్రతీకారం తీర్చుకున్న రెండేళ్ల పాప?
తను కాటేసిన పాము ను గట్టిగా పట్టుకున్న రెండేళ్ల పాప ఇక ఆ పామును కొరికి కొరికి చంపేసింది. బింగోర్ నగరంలో ఓ చిన్నారి బయట ఆడుకుంటుంది. ఇలాంటి సమయంలోనే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక పాము సడన్గా అక్కడ ప్రత్యక్షమైంది. దాదాపు అర మీటరు పొడవు ఉంటుంది.. ఇక అది గమనించకుండా బాలిక తన ఆటల్లో మునిగిపోయింది. ఈ క్రమంలోనే ఆ పాము బాలిక కింద పెదవిపై కరిచింది. ఈ క్రమంలోనే మొదట భయపడిన చిన్నారి ఆ తర్వాత కోపంతో ఊగిపోయింది.
కాటువేసి పారిపోతున్న సర్పాన్ని చేతిలో గట్టిగా పట్టుకుంది. దీంతో ఇక ఆ పామును కసితీరా కొరికి చంపేసింది. అయితే ఇది గమనించిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఈ క్రమంలోనే వెంటనే పాపని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పాప పాముకాటుకు గురి అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే పాము విషానికి విరుగుడు మందులు ఇచ్చారు. సదరు రెండేళ్ల చిన్నారిని 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు డాక్టర్లు. ప్రస్తుతం ఆ పాప కోలుకుంటుంది అనేది తెలుస్తుంది. కాగా పాప పామును కొరికి చంపడం మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.