లుంగీ కట్టుకున్నాడని సినిమా టికెట్ ఇవ్వలేదు.. కానీ చివరికి?

praveen
సాధారణం గా నేటి రోజుల్లో జనాలు ఎక్కువగా ట్రెండి దుస్తులు ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం తనకు ఎంతో కంఫర్టబుల్ గా ఉండే దుస్తులను ధరించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇలా ప్రతి ఒక్కరికి ఎంతో కంఫర్ట్ ఇచ్చే దుస్తుల లో లుంగీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలం లో లుంగీ  ఒక సరికొత్త ట్రెండ్ గా కూడా మారి పోయింది  తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు లో కూడా ఎక్కువగా లుంగీలు ధరిస్తుంటారు. కేరళలో కూడా ఇలాంటి ట్రెండ్ కొనసాగుతుంది అని చెప్పాలి.

 అర్బన్ ఏరియా లతో పోల్చి చూస్తే రూరల్ ఏరియా లలో ఎక్కువగా లుంగీలు ధరించే వారు కనిపిస్తూ ఉంటారు.  ఇక లుంగీ కట్టు కోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయని కొంతమంది సరదాగా వ్యాఖ్యానించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే లుంగీ ధరించడం కారణం గా ఇక్కడ ఒక వ్యక్తి కి మాత్రం చేదు అనుభవమే ఎదురైంది. ఒక వ్యక్తి లుంగీ కట్టుకొని సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్ళాడు. అయితే లుంగీ కట్టు కోవడం కారణం గా అతనికి టిక్కెట్ ఇచ్చేందుకు థియేటర్ నిర్వాహకులు నిరాకరించారు. ఈ ఘటన బంగ్లాదేశ్లో వెలుగు లోకి వచ్చింది.

 అయితే ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ప్రజలు భారీ ఎత్తున స్పందించారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున అందరూ కూడా లుంగీలు కట్టుకొని థియేటర్కు వెళ్లారు. దీంతో నిర్వాహకులు అయోమయంలో పడిపోయారు.  తప్పు జరిగింది అని ఒప్పుకొని సదరు వ్యక్తికి ఫ్యామిలీ తో సహా  సినిమా చూసేందుకు అవకాశం కల్పించారు. స్టార్ మల్టీప్లెక్స్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వార్త కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: