ఎట్టకేలకు.. ఉక్రెయిన్ ముందడుగు వేసింది?

frame ఎట్టకేలకు.. ఉక్రెయిన్ ముందడుగు వేసింది?

praveen
గత కొన్ని నెలల నుంచి ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యా హెచ్చరికల నేపథ్యంలో ఎన్నో దేశాలు ఉక్రెయిన్ నుంచి సంబంధాలు పెంచుకోవడానికి కూడా సిద్ధమయ్యాయి. ఇలాంటి సమయంలోనే రష్యా ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షం కురిపిస్తూన్న నేపథ్యంలో అటు ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులు సహా మిగతా అన్ని రకాల వాణిజ్య పరమైన సంబంధాలు కూడా తెగిపోయాయి.

 రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అంతర్జాతీయ సప్లై చైన్ లో కాస్త వెనకబడి పోయింది అని చెప్పాలి. ఇక ఇలాంటి నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో గోధుమల కొరత కూడా ఏర్పడింది అని చెప్పాలి. అయితే ఎంతకీ అటు యుద్ధం మాత్రం విరమించుకునేందుకు  రష్యా సిద్ధంగా లేని నేపథ్యంలో ఒక వైపు రష్యాతో యుద్ధం చేస్తూనే మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటం పై దృష్టి పెట్టింది ఆ దేశ ప్రభుత్వం. ఈ క్రమంలోనే యుద్ధం కారణంగా ఆగిపోయిన వాణిజ్యపరమైన సంబంధాలు అన్నింటిని కూడా మళ్లీ పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇతర దేశాలకు ధాన్యాలను ఎగుమతులు చేసేందుకు ఉక్రెయిన్ ఇటీవలే ఒక కీలకమైన ఒప్పందం కూడా చేసుకుంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే కొన్ని నెలల తర్వాత ఉక్రెయిన్ నుంచి సముద్ర మార్గం ద్వారా ఆహార ధాన్యాలు రవాణా  ప్రారంభం అయ్యింది  అనేది తెలుస్తుంది. ఇటీవలే కుదిరిన ఒప్పందం మేరకు ఇక ఈ ఎగుమతులు పునఃప్రారంభం జరిగిందట. ఇక మొదటి ఒడేస్సా నౌకాశ్రయం నుంచి  రవాణ నౌక బయలుదేరినట్లు తెలుస్తుంది. టర్కీ  రక్షణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.  ఈ రవాణా నౌకలో 26 వేల టన్నుల మొక్కజొన్నలు రవాణా చేస్తున్నట్లు ఉక్రెయిన్ మంత్రి చెప్పుకొచ్చారు. ఇక రానున్న రోజుల్లో ఎగుమతులలో అటు ఉక్రెయిన్ మరింత వేగంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: