చైనా బుద్ధి మారలేదు.. సరిహద్దుల్లో మరోసారి?

praveen
చైనా వక్రబుద్ధి ఇంకా మారలేదా.. సరిహద్దుల్లో ఇంకా తోక జాడిస్తూనే ఉందా.. భారత సైన్యం వరుసగా చైనా కు షాక్ ఇస్తున్న.. ఇంకా తీరు మార్చుకోలేదా.. ఇక ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నల తెరమీదికి వస్తున్నాయి.  కారణం ఇటీవల సరిహద్దు లో జరిగిన ఘటన.  సరిగ్గా కొన్ని నెలల క్రితం భారత్-చైనా సరిహద్దు లో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చింది  చైనా. నిషేధిత భూభాగం లోకి వచ్చి గుడారాలు ఏర్పాటు చేసుకుంది. ఎందుకు ఇలా గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు అంటూ అడగడానికి వెళ్లిన భారత సైనికులను కొట్టి చంపింది. ఇక ఆ తర్వాత భారత సైన్యం ఊరుకుంటుందా.. ఒక్కసారిగా రంగంలోకి దిగి సింహపు గుంపుల చైనా సైన్యం పై పడి ఒక్కొక్కరి మెడలు విరిచేశారు.

 దీంతో చైనా కు ఊహించని షాక్ తగిలింది. సరిహద్దుల్లో తమకు భయపడి వెనకడుగు వేస్తుంది అనుకున్న భారత్ దైర్యంగా నిలబడటంతో చైనాకు ఏం చేయాలో పాలు పోలేదు. దీంతో సరిహద్దుల్లో ఎప్పుడూ ఏదో ఒక ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూనే ఉంది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికులు కూడా భారీగా మోహరించి పహారా కాస్తున్నారు. ఇక ఏ క్షణంలో ఇరు దేశాల మధ్య యుద్ధం తలెత్తుతుందో అనే విధంగానే ఉంది పరిస్థితి. ఇలాంటి సమయంలో గత కొంత కాలం నుంచి నుంచి చైనా ఎలాంటి తోక  జాడింపు  చర్యలకు పాల్పడలేదు.

 ఇటీవల జరిగిన ఘటన మాత్రం చైనా బుద్ధి మార్చుకో లేదు అన్న దానికి నిదర్శనం గా మారిపోయింది. సరిహద్దుల్లో మరోసారి వక్రబుద్ధి చాటుకుంది చైనా. సరిహద్దుల్లో భారత్  ను రెచ్చగొట్టే విధంగా చర్యలకు పాల్పడింది. సరిహద్దు నిబంధనలు అతిక్రమించి చైనాకు చెందిన యుద్ధ విమానం వాస్తవాధీన రేఖ సమీపంలో కి రావడం గమనార్హం. భారత వైమానిక దళ రాడార్లు గుర్తించి సమాచారం అందించగా భారత సైన్యం అప్రమత్తం కావడంతో వెంటనే చైనా విమానం వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే వాస్తవాధీన రేఖ సమీపంలో యుద్ధ విమానం వచ్చిన నేపథ్యంలో భారత చైనాను హెచ్చరించింది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: