మరో దేశం పై.. రష్యా యుద్ధం?

praveen
రష్యా తమ పొరుగున ఉన్న చిన్న దేశాల పై ఆధిపత్యం చెలాయించటమే లక్ష్యంగా ప్రతి అడుగు వేస్తోంది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం అగ్ర దేశాల లో ఒకటిగా కొనసాగుతున్న రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తుంది. పొరుగున వున్న ఉక్రెయిన్ తమ తో సంబంధాలు తెంచుకునీ అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలతో కలిసేందుకు సిద్ధమైన నేపథ్యంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది రష్యా. అయినప్పటికీ ఉక్రెయిన్ మాత్రం తమది స్వతంత్ర సార్వభౌమాధికారం కలిగిన దేశం అని తాము ఎవరితో కలిసి ఉండాలి అని మేమే నిర్ణయించుకుంటాము అంటూ బల్ల గుద్ది చెప్పింది ఉక్రెయిన్.

 దీంతో అగ్ర దేశంగా కొనసాగుతున్న రష్యా సైనిక చర్య పేరుతో దాదాపు నూట ముప్పై రోజులకు నుండి అటు ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇలా రష్యా ఉక్రెయిన్ మధ్య ఉన్న ఆందోళనకర పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచ దేశాలను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. రోజులు గడుస్తున్నాయి తప్ప అటు యుద్ధంలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఉక్రెయిన్ పై యుద్ధం చేసి ఎన్నో ప్రాంతాలను తమ హస్తగతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో దేశంపై యుద్ధం చేసేందుకు సిద్ధమవుతోంది రష్యా అని తెలుస్తోంది.

 పొరుగున ఉన్న ఫిన్లాండ్ పైన కూడా సైనికచర్యకు సిద్ధమవుతున్నట్లు ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది. రష్యాతో 1340 కిలోమీటర్లు సరిహద్దు పంచుకుంటుంది ఫిన్లాండ్. ఈ క్రమంలోనే తమపై రష్యా దాడులు చేసే అవకాశం ఉంది అనే సంకేతాలతో సరిహద్దు లోకి భారీగా బలగాలను తరలిస్తుంది అనే చెప్పాలి. నాటో కూటమి తో కలవద్దన్న  రష్యా ఆదేశాలను ఫిన్లాండ్ డిక్కరించింది  అనేది తెలుస్తుంది.  ఈ క్రమంలోనే నాటో యూరోపియన్ యూనియన్ దేశాలతో కలిసేందుకు ఫిన్లాండ్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ పై సైనిక చర్య ప్రారంభించినట్లు గానే ఫిన్లాండ్ పై కూడా అదే వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: