పురుషాంగం చిన్నగా ఉందంటూ ఎగతాళి.. పోలీస్ ఉద్యోగం పోయింది?

praveen
టైటిల్ చూడగానే కాస్త విచిత్రంగా కాస్త కన్ఫ్యూజన్ గా అనిపించింది కదా.. పురుషాంగం చిన్నగా ఉందని ఎగతాళి చేయడం ఏంటి.. ఎగతాళి చేసినందుకు ఒక వ్యక్తి పోలీసు ఉద్యోగం కోల్పోవడం ఏంటి అని అనుకుంటున్నారు కదా.. మీరు ఎంత ఆశ్చర్యపోయినా ఇది నిజమే.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ ఘటన నిజంగానే జరిగింది. అయితే మన దేశంలో కాదు యుకెలో వీల్డ్ చైర్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఆడమ్ రీడ్స్ అనే పోలీస్ అధికారి తన సహోద్యోగి పురుషాంగం పరిమాణం చిన్నదిగా ఉంది అంటూ ఎగతాళి చేశాడు. ఇక ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇక పోలీసు ఉద్యోగం నుంచి అతను తొలగించబడ్డాడు.

 ఈ ఘటన కాస్త ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే డిపార్ట్మెంట్లో కొత్తగా ఎంపికైన వ్యక్తిని టీజ్ చేసే క్రమంలో ఆడమ్ రీడ్స్ అనే ఆఫీసర్ ఉద్దేశపూర్వకంగానే అతని ప్యాంటు విప్పి చేతితో పురుషాంగాన్ని తాకాడు. అంతే కాదు అతని పురుషాంగం చిన్నగా ఉంది అంటూ గట్టిగా అరుస్తూ ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో ఎంతో అవమానకరంగా ఫీల్ అయిన సదరు బాధితుడు వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అయితే ఇదంతా కేవలం ఆట  పట్టించేందుకు మాత్రమే చేసాము అంటూ ఆడమ్ రీడ్స్ ఎంతలా మొత్తుకున్నా అటు పై అధికారులు మాత్రం వినలేదు అని చెప్పాలి.

 చివరికి ఇలా ఎగతాళి చేసిన ఆడమ్ రీడ్స్ ను ఉద్యోగం నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు. అయితే ఈ  ఇష్యూపై స్పందించిన ఒక సీనియర్ అధికారి బాధితుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొత్తగా చేరాడు. సీనియర్ గా ఉన్నా ఆడమ్ అతని బెదిరించేందుకు ప్రయత్నించడమే గాక సహోద్యోగుల ముందు ఎగతాళి చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో చర్యలు తీసుకున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు ఎదుటి వాళ్ళను గౌరవించే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో కొనసాగడానికి అనర్హుడు అంటూ తీర్పునివ్వడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: