రాత్రి 10 దాటితే వేడుకలు బంద్.. షాక్ ఇచ్చిన ప్రభుత్వం?

praveen
ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇక రాజకీయ అస్థిరత తోడు కావడంతో ఇక పాకిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారిపోతున్నాయి. ఇక ఇప్పుడు పాకిస్థాన్లో విద్యుత్ సంక్షోభం కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే విద్యుత్ సంక్షోభాన్ని తగ్గించేందుకు అటు ప్రధాని శబాజ్ షరీఫ్ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని నగరమైన ఇస్లామాబాద్లో  సరే రాత్రి 10 గంటలు దాటిన తర్వాత జరిగే వివాహ వేడుకలు పై నిషేధం విధిస్తున్నట్లు అక్కడి మీడియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు అక్కడి మీడియా కథనాలు ప్రచురితం చేసింది.

 వీలైనంత ఎక్కువగా విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఇలాంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం సెలవు ప్రకటించారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇస్లామాబాద్ నగరంలో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత వివాహ వేడుకలు జరగడానికి వీలు లేదు అంటూ తేల్చి చెప్పింది ప్రభుత్వం. ఇక మరోవైపు పాకిస్థాన్లో నెలకొన్న విద్యుత్ సంక్షోభం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని తెలుస్తోంది. దీంతో ఇక పెళ్ళిళ్ళ పై నిషేధం నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలంటూ అక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

 ఇక ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే చమురు గ్యాస్ కు కొనేందుకు తమ వద్ద డబ్బులు లేవని ఇప్పటికే ప్రభుత్వం సోషల్ మీడియాలో తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఇలా చమురు గ్యాస్ కొరత కూడా ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడి జనాలు పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అధికారంలోకి వచ్చిన శాబాజ్ షరీఫ్  గవర్నమెంట్ పరిస్థితులను ఎలా అదుపులోకి తీసుకోస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: