బ్లూ కలర్ రోడ్లు.. ఎక్కడో తెలుసా?

praveen
సాధారణంగా రహదారులు అంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువగా ఎక్కడ చూసినా తారురోడ్డు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక రహదారులు అన్నీ నలుపు రంగులోనే ఉంటాయి. కేవలం మన దేశంలోనే కాదండోయ్ అన్ని దేశాలలో కూడా నలుపు రంగులోనూ రహదారులు ఉంటాయ్. కాకపోతే  రహదారులపై సిగ్నల్స్ కోసం వివిధ కలర్స్ లో లైన్స్ ని ఏర్పాటు చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఎక్కడైనా నీలిరంగు రహదారులు ఉండడం చూసారా.

 నీలిరంగు రహదారులు ఏంటండి వినడానికి కూడా కొత్తగా ఉంది అయిన నీలి రంగు రహదారులు ఏ దేశంలో అయినా ఉంటాయా అని అంటారు ఎవరైనా.. కానీ నిజంగానే నీలిరంగు రహదారులు ఉన్నాయి అన్న విషయం తెలిసి ప్రస్తుతం అందరూ అవాక్కవుతున్నారు. ఇంతకీ ఈ నీలి రంగు రహదారులు ఎక్కడ ఉన్నాయి అని అనుకుంటున్నారు కదా. గల్ఫ్ దేశమైన ఖాతార్ లో. గల్ఫ్ దేశాలలో ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండలు ఎంత దంచి కొడుతూ ఉంటాయో   ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడి ఎండలకి అందరూ తెగ ఇబ్బంది పడి పోతూ ఉంటారు.

 ఇక ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో నల్లటి తారురోడ్డు సూర్యకాంతిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఈ క్రమంలోనే గల్ఫ్ దేశం ఖతార్ లోనీ రాజధాని నగరం దోహాలో రహదారులు నల్లగా కాకుండా బ్లూ కలర్ లో ఉంటాయి. నల్లటి రహదారులు వేయడం వల్ల సూర్యకాంతి ఆకర్షించడంతో మరింత వేడి పెరుగుతూ ఉందని భావించి అక్కడ ప్రభుత్వ అధికారులు ఇలాంటి ఆలోచన చేశారు. దీంతో 50 డిగ్రీలు ఉండే టెంపరేచర్ కేవలం 20 డిగ్రీల వరకు తగ్గుతుందని.. అంతేకాకుండా ఇక రహదారిలో నాణ్యత కూడా బాగుంటుంది అని అక్కడి అధికారులు చెబుతుండటం గమనార్హం.. ఏది ఏమైనా బ్లూ కలర్ రహదారులు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: