ఈ దేశాల్లో ఇండియన్ పాస్ పోర్ట్ ఉంటే జాబ్ గ్యారంటీ ?

frame ఈ దేశాల్లో ఇండియన్ పాస్ పోర్ట్ ఉంటే జాబ్ గ్యారంటీ ?

VAMSI
విదేశాల్లో అయితే బాగా సంపాదించుకుని లైఫ్ లో సెటిల్ అవచ్చు అన్నది చాలా మంది ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడే చేసే ఉద్యోగాలు అక్కడ చేస్తే ఎక్కువ మొత్తంలో జీతాలు వస్తాయి. ఖర్చులు పోను చాలానే వెనకేసుకోవచ్చు. అందుకే చాలా మంది ఇతర దేశాలలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడాలని అనుకుంటూ ఉంటారు. అయితే అలా ఇతర దేశాలలోకి వెళ్ళాలి అంటే ముందుగా కొంత పెట్టుబడి అవసరం. ఎందరో అలా ఆర్థిక స్థోమత సరిపోదని ఒక్క కారణంతో వెనక్కి తగ్గుతుంటారు. అయితే ఇండియన్ పాస్‌పోర్ట్ ఉన్న వారికి కొన్ని దేశాల్లో సులభంగా ఉద్యోగాలు లభిస్తాయన్న విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.. ఆయా దేశాలలో పౌరసత్వం పొందటం కూడా సులభమే. . వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనండి. అది ఎలా..?? ఏమిటి అన్న విషయాలు తెలుసుకుందాం పదండి.
ఆస్ట్రియా: ఆస్ట్రియా దేశంలో మంచి లైఫ్ స్టైల్ ను పొందవచ్చు.  ఇండియన్ పాస్‌పోర్ట్ ఆధారంగా ఈ దేశ పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంది. ముందుగా డి వీసా కేటగిరీ కింద తొలుత ఆరు నెలల పాటు అక్కడ నివసించేందుకు అనుమతులు పొందాలి. అనంతరం  పర్మినెంట్ రెసిడెన్సీ కూడా పొంది పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది .
బెలిజ్: మధ్య అమెరికా దేశమైన బెలిజ్ లో కూడా కాస్ట్ అఫ్ లివింగ్ కూడా చాలా తక్కువే. అక్కడ ఎక్కువ మంది ప్రజలు ఇంగ్లిష్ బాషలో మాట్లాడుతారు. ముందుగా 30 రోజుల విజిట్ వీసాపై, ఆ తర్వాత కావాలంటే ఆ గడువును పొడిగించుకోవచ్చు, అలాగే  అక్కడే సెటిల్ అయ్యే అవకాశం పొందటం కూడా ఉంది. 1000 డాలర్లతో పాటు కొన్ని డాక్యుమెంట్లను సమర్పిస్తే చాలు అక్కడే లైఫ్ లాంగ్ పొందవచ్చు.
బెల్జియం: ఈ దేశం కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి . కాకపోతే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ జాబ్ లో చేరాక కొంతకాలం గడిస్తే... అక్కడే సెటిల్ అవ్వడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈక్వెడార్: ఈ దేశంలో పౌరసత్వం పొందడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగానే వీసా దొరుకుతుంది. ఇక ఇక్కడ నివసించడానికి వయసు పరిమితి కూడా లేదట. ఒక నెలలో మీ సమాపదాం ౮౦౦ డాలర్లు అయితే చాలు ఈజీగా ఈ దేశ పౌరసత్వాన్ని పొందే వీలుంది.
ఇలా పైన తెలిపిన దేశాలలో ఈజీగా జాబ్ ను పొందవచ్చట. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు లేదా మీకు తెలిసిన వారికి ఈ విషయాన్ని చెప్పండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: