జెలెన్ స్కీ వింత.. రష్యా అది దొంగలించిందట?

praveen
అప్పుడెప్పుడో రెండు నెలల క్రిందట ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టిన రష్యా ఇంకా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది  ఇప్పటికీ. ఈ క్రమంలోనే ఎన్నో ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న రష్యా దేశం మొత్తాన్ని కూడా తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ఇంకా తిరుగులేకుండా దాడులకు పాల్పడుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఉక్రెయిన్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం నేపథ్యంలో అటు ఉక్రెయిన్ లో ఆర్థిక సంక్షోభం ఆహార సంక్షోభం కూడా రోజురోజుకు పెరిగి పోతున్నాయ్ అనే విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఇక కనికరం లేకుండా ఉక్రెయిన్ పై  రష్యా యుద్ధం చేస్తూ ఉండటం పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఎన్ని రోజులనుంచి షాకింగ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ప్రపంచ దేశాలు సహాయం కావాలని కోరడమే కాదు ఉక్రెయిన్ సైనికులలో ధైర్యాన్ని నింపుతున్నారు.  అంతేకాకుండా ఉక్రెయిన్లో రష్యా ఎలాంటి ఆగడాలకు పాల్పడుతుంది   అన్న విషయాలను కూడా ఎప్పటికప్పుడు ప్రపంచదేశాలకు వివరిస్తూనే ఉన్నారు జెలెన్ స్కీ. ఇకపోతే ఇటీవల జెలెన్ స్కీ రష్యా గురించి చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్ అని చెప్పాలి. ఇన్నాళ్ళ వరకు అటు రష్యా దాడుల గురించి మాట్లాడిన జెలెన్ స్కీ.. ఇప్పుడు మరో అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు.

 ఏకంగా రష్యా ఉక్రెయిన్ నుంచి ఆహారధాన్యాలు దొంగతనం చేసింది అంటూ జెలెన్ స్కీ ఆరోపిస్తూ ఉండడం గమనార్హం. 1.50 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను రష్యా దొంగలించింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు  ప్రస్తుతం ఉక్రెయిన్ కు సహాయం చేసేందుకు దేశ విదేశాల నుంచి ఆహారధాన్యాలు వస్తున్నాయి  ఈ క్రమంలోనే ఇక విమానాలు రైళ్ల ద్వారా ఆహార ధాన్యాలు ఉక్రెయిన్ కు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే  ఉక్రెయిన్ కు అందిన  ఆయుధాలను రష్యా ధ్వంసం చేయగా  పక్కనే ఉన్న ఆహార ధాన్యం ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలోనే రష్యా ఆహారధాన్యాలు దొంగలించింది అంటూ జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు. ఒక దేశ అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: