బతికున్న వ్యక్తిని చనిపోయాడని మార్చురీకీ తీసుకెళ్లారు.. చివరికి?

praveen
మొన్నటి వరకు ప్రపంచాన్ని మొత్తం భయాందోళనకు గురి చేసిన కరోనా వైరస్ ఇక ఇప్పుడు పుట్టినిల్లయిన చైనాలో విజృంభిస్తుంది. ప్రతిరోజు అక్కడ భారీ రేంజ్ లోనే కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించి ప్రజలను ఇళ్లకే పరిమితం అయ్యేలా చేసినప్పటికీ కూడా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు అని చెప్పాలి. దీంతో భారీగా కేసులు వెలుగులోకి వస్తుండడంతో చైనాలోని చాలా నగరాలు విలవిలలాడిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అటు దారుణమైన పరిస్థితులు కూడా చైనాలో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇటీవలే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చైనాలోని షాంగై నగరంలో వృద్ధుల సంరక్షణ కేంద్రంలో ఒక సీనియర్ సిటిజన్ చనిపోయాడు అంటూ పొరపాటు పడిన సిబ్బంది అతడు బతికుండగానే బ్యాగ్లో ప్యాక్ చేసి మార్చరీకి తరలించారు. అయితే ఇప్పటికే అక్కడ లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం మరింత సంచలనంగా మారిపోయింది. ఇలా ఒక వృద్ధుడిని  పసుపు రంగు బ్యాగ్ లో ప్యాకింగ్ చేసి ఒక వెల్ఫేర్ హాస్పిటల్ కి తీసుకు వచ్చారు.

 ఈ క్రమంలోనే సదరు హాస్పిటల్ సిబ్బందిలో ఇద్దరు ఇక ఆ బ్యాగ్ తెరిచి చూడడంతో వృద్ధుడు బతికే ఉన్నాడు అన్న విషయం బయటపడింది. అయితే నిరసనలకు భయపడి సిబ్బంది ఆ వృద్ధుడు ఊపిరిపీల్చుకుంటాడేమో అనుకోని బ్యాగ్ ను సీల్ చేశారు. ఆ వృద్ధుడిని తిరిగి సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ ఘటన గురించి తెలిసి స్థానిక ఆరోగ్య అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ప్రస్తుతం వృద్ధులు ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు అక్కడి ఆరోగ్య అధికారులు. కానీ ఈ ఘటన మాత్రం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: