రష్యా రసాయన దాడి.. నిజమేనా?

praveen
మొన్నటికి మొన్న ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధాన్ని విరమించి సైనికులందరూ వెనక్కి తగ్గారు అని అనుకుంటున్న సమయంలో రష్యా కొత్త వ్యూహాన్ని ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. మరో వైపు నుంచి దాడి చేయడం మొదలు పెట్టింది. మేం చేస్తుంది కేవలం సైనిక చర్య అని చెబుతున్న రష్యా పూర్తిగా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తూ విరుచుకుపడుతుంది. ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో రష్యా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఉక్రెయిన్ సైనికులు కూడా చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉక్రెయిన్లోని 70 శాతం భూభాగం రష్యా హస్తగతం అయినట్లు తెలుస్తోంది.

 ఒక మరి కొంత భూభాగం రష్యా హస్తగతం అయిందంటే ఇక ఉక్రెయిన్ పూర్తిగా  ఉక్రెయిన్ తమ అధీనంలోకి తెచ్చుకోబోతుంది అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్న మాట. ఇక గత రెండు రోజుల నుంచి మరియపోల్  దగ్గర రష్యా దాడి తీవ్రంగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ దాడులపై ఇన్వెస్టిగేషన్ కి సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఎలాగైనా ఉక్రెయిన్ లో ఉన్నటువంటి మరియపోల్ ను స్వాధీనం చేసుకోవాలని కంకణం కట్టుకున్న రష్యా  అక్కడా  రసాయన దాడికి దిగింది అంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.

 మానవ రహిత విమానం ద్వారా రసాయినిక దాడికి పాల్పడింది అంటూ ఉక్రెయిన్ లోని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇలా మానవ రహిత విమానం ద్వారా  విష పదార్థాలను రష్యా సైన్యం జారవిడిచిందని  సమాచారం. ఈ మేరకు ఇక విచారణ కొనసాగిస్తున్నారు. సైనిక స్థావరాలు పౌర ఆవాసాలు లక్ష్యం గా ఇక ఈ రసాయనిక దాడి జరిగింది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఊపిరి తీసుకోవడం లో ఎంతో మంది ఇబ్బంది పడ్డారట. ఈ క్రమం లోనె ఇక దీని పై జరుగుతున్న విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: