అమెరికా కొత్త గేమ్.. ఆ దేశాన్ని నిండా ముంచేస్తుందా?

praveen
మొన్నటి వరకు రష్యా ఉక్రెయిన్ మధ్య ఎంత తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఇక ఉక్రెయిన్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయ్. దీని గురించి అంతర్జాతీయ సమాజం మొత్తం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అనే విషయం తెలిసిందే. ఇటీవలే రష్యా చైనాలు వెనక్కి తగ్గడంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కాస్త సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో చైనా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. పొరుగున ఉన్న చిన్న దేశమైన తైవాన్ ను స్వాధీనం చేసుకోవడానికి ఎన్నో రోజులనుంచి ప్రయత్నాలు చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే తైవాన్ సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరించడం తైవాన్ గగనతలంలో కి యుద్ధ విమానాలను పంపించి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం లాంటివి చేస్తూ ఉంది చైనా. ఇక ఇప్పుడు మరో సారి ఇలాంటిది చేస్తూ తైవాన్ సరిహద్దుల్లో ఉన్న రెండు దీవులను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక ఆ దీవులకు సమీపంలో సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తుంది. ఈ క్రమంలోనే చిన్న దేశమైన తైవాన్ కూడా ఇక చైనాను ఎదుర్కొనేందుకు అన్ని సిద్ధం చేసుకుంటుంది.

 ఇక ఇలాంటి సమయంలో అమెరికా మరోసారి సరికొత్త గేమ్ స్టార్ట్ చేసింది. తైవాన్ సరిహద్దులకు పక్కనే ఉన్న దక్షిణ చైనా మహాసముద్రంలో ఫిలిప్పైన్స్ తో కలిసి భారీగా యుద్ధ విన్యాసాలు చేయడం మొదలుపెట్టింది అమెరికా. ఇక తైవాన్ కు మద్దతు ఇస్తున్నాం అంటూ ఈ యుద్ధ విన్యాసాల ద్వారా చెప్పకనే చెబుతుంది. అయితే గతంలో ఉక్రెయిన్ విషయంలో కూడా ఇలాంటి యుద్ధ విన్యాసాలు నాటో దేశాలతో కలిసి చేసిన అమెరికా యుద్ధం మొదలయ్యే సమయానికి మాత్రం ఉక్రెయిన్ ను ఒంటరిగా వదిలేసింది. ఇప్పుడు తైవాన్ విషయంలో కూడా ఇలాగే చేస్తుందా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: