రష్యా యుద్ధం.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న బీర్ కంపెనీలు?

praveen
రష్యన్ ఉక్రెయిన్  మధ్య భీకర రీతిలో యుద్ధం జరుగుతోంది. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రకటించి దాదాపు ముప్పై మూడు రోజులు గడిచిపోతున్నాయి కాని పరిస్థితుల్లో మాత్రమే ఎక్కడ మార్పు కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య యుద్ధం విరమించుకునెందుకు ఎన్నోసార్లు శాంతి చర్చలు జరిగాయి. కానీ చర్చలు మాత్రం విఫలమవుతూనే ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఇక ఇరు దేశాల మధ్య యుద్ధం ఇప్పట్లో తగ్గుముఖం పెట్టేలా మాత్రం అస్సలు కనిపించడం లేదు. అయితే ఉక్రెయిన్ పై తమ ఆధిపత్యం సాధించేందుకు రష్యా యుద్ధం చేస్తూ ఉంటే ఇక తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ సైనికులు వీరోచితంగా పోరాడుతున్నారు. ఇక ఈ యుద్ధంలో సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా వేల మంది మరణిస్తున్నారు.

 అంతేకాదు ఉక్రెయిన్ లో ఉన్న వందలాది భవనాలు కూడా రష్యా బాంబుదాడిలో నేలమట్టమయ్యాయి అని చెప్పాలి. ఇక రష్యా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలి అంటూ అగ్రరాజ్యమైన అమెరికా సహా బ్రిటన్ జపాన్ నాటో దళాలు రష్యాను హెచ్చరిస్తున్నాయి. ఇక ఆర్థిక ఆంక్షలతో  ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయినప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గకుండా దాడులకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. ఇలాంటి సమయంలోనే ఇక రష్యాలో పెట్టుబడులను వ్యాపార కార్యకలాపాలను ఉపసంహరించుకున్నాయి ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు. ఇక ఇటీవలే మరో కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకొని రష్యా కు షాక్ ఇచ్చింది.

 అతిపెద్ద బీరు ఉత్పత్తిదారు అయినా బృయింగ్ కంపెనీ ab inbev రష్యా నుంచి నిష్క్రమిస్తునట్లు  తెలిపింది. ఇక రష్యాన్ ఫెడరేషన్లో బడ్ వైజర్ బ్రాండ్ ను ఉత్పత్తి చేయడానికి విక్రయించడానికి లైసెన్స్ ను సస్పెండ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రపంచ మార్కెట్లో బృయింగ్ కంపెనీ ab inbev వాటా ఏకంగా 20 శాతంగా ఉంది.  ఇక ఈ కంపెనీ తోపాటు పాశ్చాత్య దిగ్గజాలు కార్ల్స్ బర్క్ లాంటివి రష్యాను విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత వాతావరణంలో ఇక ఇదే సరైన నిర్ణయం అని తాము నమ్ముతున్నాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇలా పలు అంతర్జాతీయ కంపెనీలు పలు దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా  రష్యాలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న రష్యా యుద్ధం ఏ మాత్రం ఆపడం లేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: