పాపం ఎంత దుస్థితి.. రష్యాలో చక్కెర కోసం కొట్టుకున్నారు?

praveen
ఉక్రెయిన్ పై దాడికి దిగి రాక్షసానందం పొందుతున్న రష్యా ను నిలువరించేందుకు పాశ్చాత్య దేశాలు మొత్తం తమకు కుదిరిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ కు ఆయుధాలు అందించక పోయినప్పటికీ రష్యాపై  ఆర్థికపరమైన యుద్ధం చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక రష్యా తీరు మార్చుకోవాలి అంటూ ముందుగా హెచ్చరికలు జారీ చేశాయ్. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఉక్రెయిన్ పై యుద్ధం విరమించకపోవడంతో చివరికి ఇక అన్ని రకాల ఆర్థిక ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయ్. దీంతో ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తూ బీభత్సం సృష్టి స్తున్న ఇక ఆర్థిక ఆంక్షల   కారణంగా రానున్న రోజుల్లో  ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 ఇప్పటికే పాశ్చాత్య దేశాల ఆర్థిక చట్రంలో ఇరుక్కుపోయిన రష్యాలో ఇక ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అనేది తెలుస్తుంది. మరీ ముఖ్యంగా నిత్యావసరాల లభ్యత కూడా చాలా తక్కువగా మారిపోయింది. దీంతో వరద బాధితులు ఆహారం కోసం ఎదురు చూసినట్లుగా.. ఇక ఇప్పుడు రష్యా లో ఉన్న ప్రజలు నిత్యవసర సరుకులు ఎక్కడ ఉన్నాయా అని ఎదురుచూస్తున్నారు. ఎక్కడైనా కనిపిస్తే పోటీపడి మరీ ఇక నిత్యావసరాలను తగ్గించుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 కేవలం ఒక్కరూ 10 కేజీల చక్కెర మాత్రమే కొనుగోలు చేయాలంటూ కొన్ని దుకాణాలు పరిమితిని విధించాయి. దీంతో ఇక ఇటీవలే ఒక దుకాణంలో చిన్నపాటి తోపులాట కూడా జరిగింది. ఇక రష్యాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతున్న నేపథ్యంలో పంచదార ధర ఆకాశాన్ని అంటుతుంది. ఇక పాశ్చాత్య దేశాల ఆంక్షల  కారణంగా రష్యాలో ద్రవ్యోల్బణం పెరిగి పోయింది. 2015 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుంది.  ఈ క్రమంలోనే ఇటీవలే ఒక షాపులో ఏకంగా చక్కర కోసం కొంత మంది జనాలు పోటీపడ్డారు. అంతేకాదు చక్కర కోసం ఒకరినొకరు తోసుకుంటూ మరి చక్కెరను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. ఈ వీడియో రష్యా లో ఎలాంటి పరిస్థితి ఉంది. కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది అని నెటిజన్లు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: