తాలిబన్ల ఎఫెక్ట్.. క్యాబ్ డ్రైవర్గా ఆర్థిక మంత్రి?

praveen
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రజాస్వామ్య పాలన జరుగుతున్న సమయంలో ఆయుధం చేత పట్టిన తాలిబన్లు ఎన్నో అరాచకాలు సృష్టించారు.  కనిపించిన వారిని దారుణంగా హత్య చేస్తూ అందరిలో భయం పుట్టించి తమ మాట వినేలా చేశారు. ఇక ఆ తర్వాత క్రమక్రమంగా  ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుం టూ చివరికి ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా కూల్చేస్తారు. తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు ఆశ్రఫ్ ఘని  దేశం వదిలి పారిపోయే పరిస్థితి వచ్చింది అనే విషయం తెలిసిందే.

 అయితే తాము మారిపోయానని చట్టాల్లో మార్పులు తీసుకువస్తామని మహిళలకు సముచిత గౌరవం కల్పిస్తామంటూ చెప్పారు తాలిబాన్లు. కొన్నాళ్లపాటు మాయమాటలతో అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించేందుకు  ప్రయత్నించారు. కానీ ఆ తర్వాత మాత్రం వారి అసలు స్వరూపం బయటపెట్టి మహిళలను వంట ఇంటికి పరిమితం అయ్యే బానిసలుగా మార్చేసారు. ఇక ఉద్యోగాలు చేసుకుంటూ సభ్యసమాజంలో గర్వంగా బతుకుతున్న మహిళలందరికీ కూడా చివరికి సెక్స్ బానిసలుగా మార్చుకున్నారు. ఇలా తాలిబన్లు వ్యవహరించే తీరు రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోతుంది.

 అయితే ఆఫ్ఘనిస్తాను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడి ప్రజల తో పాటు ప్రభుత్వాధి నేతలు కూడా ప్రస్తుతం దుర్భర  జీవితం గడపాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అని తెలుస్తోంది. ఘని ప్రభుత్వం లో ఆర్థిక శాఖ మంత్రి గా పనిచేసిన ఖలీద్ అయెన్దా తన కుటుంబాన్ని పోషించేందుకు అమెరికా లో టాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఆయన ఇంటర్వ్యూ చేయడం తో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది.. ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. గతంలో ఇక తాలిబన్ల రాకకు ముందు ప్రభుత్వంలో కొనసాగిన మిగతా వారు ఎక్కడ ఉన్నారు అని వెతకడం ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: