దానికి ఓకే అంటే.. వెంటనే యుద్ధం ఆపేస్తాం : రష్యా

praveen
పది రోజులు గడిచిపోతున్నాయి కానీ ఆ మారణహోమం మాత్రం ఆగడం లేదు.. అన్ని దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయ్. కానీ అతను మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు... పసికునా లాంటి ఉగ్రవాదంపై ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ సేనలతో భీకరంగా దాడి చేస్తూ ఉండటం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఉక్రెయిన్ లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడానికి తమ లక్ష్యం అంటూ చెబుతున్న పుతిన్ ఇక చిన్న దేశమైన ఉక్రెయిన్లో మారణహోమాన్ని సృష్టిస్తున్నాడు.


 ఎడతెరిపి లేకుండా దాడులకు పాల్పడుతూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉక్రెయిన్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ లో ఉన్న నగరాలు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం లక్ష్యంగా ప్రస్తుతం రష్యా సేనలు ముందుకు దూసుకుపోతూ ఉన్నాయ్. ఇక ఇప్పటికే ఇరు దేశాల విదేశాంగ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగినా అవి విఫలం అయ్యాయి.. ఇలాంటి సమయంలో ఇటీవలే రష్యా కీలక ప్రకటన చేసింది. తాము విధించిన షరతులకు అంగీకరిస్తేనే ఉక్రెయిన్ పై యుద్దాన్ని తక్షణం నిలిపివేస్తామని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారిపోయిం.ది ఈ విషయాన్ని పుతిన్ ప్రెస్ సెక్రెటరీ ప్రకటించారు.



 ఉక్రెయిన్ ప్రభుత్వం ముందు రష్యా ఏకంగా నాలుగు రకాల షరతులు విధించడం గమనార్హం. అందులో ఒకటి వెంటనే సైనిక చర్యను ఆపాలని డిమాండ్ చేసింది. ఇక రెండవది తటస్థంగా ఉండేలా రాజ్యాంగాన్ని మార్చాలి అని తెలిపింది.. మూడవది క్రిమియా రష్యా భూభాగం గానే గుర్తించాలి అంటూ డిమాండ్ చేసింది. ఇక నాలుగవది డొనేట్స్,లూహన్స్ లాంటి ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా అంగీకరించాలి అంటూ ఉక్రెయిన్ ముందు రష్యా షరతులు పెట్టింది. ఇక ఈ నాలుగు డిమాండ్లకు ఉక్రెయిన్ ఒప్పుకుంటే  ఒప్పుకుంటే  తక్షణమే యుద్ధాన్ని నిలిపివేస్తామని అంటూ రష్యా ప్రకటించింది. ఇక ఉక్రెయిన్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: