రష్యా దాడి.. ప్రపంచంలోనే అతి పెద్ద విమానం ధ్వంసం?

praveen
రష్యా ఉక్రేయిన్ మధ్య జరుగుతున్న  యుద్ధం రోజు రోజుకూ తారాస్థాయికి చేరుతుంది. తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టినట్లు మాత్రం కనిపించడం లేదు. అటు రష్యా ఎడతెరిపి లేకుండా ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. అదే సమయంలో ఇక తక్కువ సైన్యాన్ని కలిగి ఉన్నప్పటికీ అటు ఉక్రెయిన్ మాత్రం ఎంతో వీరోచితంగా పోరాటం చేస్తోంది. ఎక్కడ రష్యా సైన్యానికి లొంగిపోవడానికి మాత్రం అస్సలు ఇష్టపడటం లేదు. అయితే మొన్నటి వరకు కేవలం సైనిక స్థావరాలపై మాత్రమే దాడులు చేస్తున్నాము అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది రష్యా. కానీ ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ లో ఉన్న కీలకమైన నగరాలను స్వాధీనం చేసుకునెందుకు రష్యా సైన్యం ముందుకు సాగుతోంది.

 ఈ క్రమంలోనే ఏకంగా జనావాసాల పై కూడా ఆయుధ ప్రయోగాలు చేపడుతూ ఉండడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే రష్యా తీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అటు నాటో యూరోపియన్ యూనియన్ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ పై దాడులను మాత్రం రష్యా ఆపడం లేదు. ఈ క్రమంలోనే ఎడతెరిపి లేకుండా రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్లోని ప్రజలందరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న పరిస్థితి ఏర్పడింది.

 ఇకపోతే ఇటీవలే రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాన్ని ధ్వంసం చేసింది. ఉక్రెయిన్ కు చెందిన ఫ్లాగ్ మ్యాన్ ఎయిర్ క్రాఫ్ట్ ను  రష్యా బలగాలు ధ్వంసం చేసాయ్. ఈ విషయాన్ని ఉక్రెయిన్ డిఫెన్స్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఇటీవలే ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ ప్రాంతంలో ఉన్న మోనోస్టల్ విమానాశ్రయంపై రష్యా దళాలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో  విమానం గా ప్రఖ్యాతి గాంచిన ఫ్లాగ్ మాన్ ఎయిర్క్రాఫ్ట్ ను ధ్వంసం చేశాయి.  ఇక దీనిని బాగుచేయడానికి మూడు మిలియన్ లకు పైగా ఖర్చు తో పాటు చాలా సమయం పడుతుందని ఉక్రెయిన్ డిఫెన్స్ తెలిపింది. కాగా దీనిని 1980లో రూపొందించారు. ప్రపంచంలోనే ఇప్పటివరకూ నిర్మించిన అత్యంత పొడవైన బరువైన విమానం ఇదే కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: