ట్రక్ ధర రెండున్నర కోట్లు.. డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?

praveen
సాధారణంగా మనం కొన్ని హాలీవుడ్ సినిమాలు చూస్తుంటే ఆ సినిమాలో కొన్ని ట్రక్కులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అలాంటి ట్రక్కులు మాత్రం భారతదేశంలో దాదాపు కనిపించవు అని చెప్పాలి. కానీ ఇటీవలే ఇక భారతదేశంలో కూడా హాలీవుడ్ సినిమాల్లో కనిపించే ఒక ట్రక్ ప్రత్యక్షమైంది. ఇక ఇది చూసి అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఇలా హాలీవుడ్ సినిమాల్లో కనిపించే ట్రక్కులు అమెరికా రోడ్లపై కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అధునాతన ఫీచర్లతో నిండి ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ వాహనాలకు సంబంధించిన ధర కూడా అధికంగానే ఉంటుంది.


 కానీ ఇటీవలే గుజరాత్కు చెందిన ఒక వ్యక్తి ఏకంగా అమెరికాకు చెందిన ఒక ట్రక్ కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు అన్నది తెలుస్తుంది. కన్వర్త్ కంపెనీకి చెందిన ట్రక్ ని కొనుగోలు చేశాడు.  హెవీ మీడియం రేంజ్ వాణిజ్య వాహనాలను తయారు చేయడంలో ఎంతో ప్రత్యేకత గల కంపెనీ కెన్ వర్త్. అయితే ఇటీవల ట్రాన్స్పోర్ట్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ వీడియో లో భాగంగా ఈ ట్రక్ యజమాని జమాల్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాను కొనుగోలు చేసిన ట్రక్ అమెరికా నుంచి దిగుమతి అయింది అంటూ యజమాని చెప్పుకొచ్చాడు.


 కాగా సరికొత్త టెక్నాలజీతో కూడిన ఈ వాహనాలు నడిపేందుకు అటు డ్రైవర్ ని కూడా అమెరికా నుంచి తీసుకు వచ్చినట్లు సదరు యజమాని చెబుతున్నాడు. అయితే ట్రక్ డ్రైవర్ కు నెలకు లక్ష రూపాయల వరకు జీతం తీసుకుంటున్నాడూ అని చెప్పుకొచ్చాడు సదరు వ్యక్తి. అయితే ఈ ట్రక్ విలువ 2.5 కోట్లు అని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అంతేకాకుండా ఇక ఈ వాహనాల దిగుమతి చేసుకోవడం కోసం సుంకం ముప్పై లక్షల దిగుమతి సుంకం రోడ్డు పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. తన దగ్గర ఇతర వాణిజ్య ట్రక్కులు కూడా ఉన్నాయని ఇంటర్వ్యూలు సదరు యజమాని చెప్పడం గమనార్హం. ఏదేమైనా ఇక ట్రక్ డ్రైవర్ కు లక్ష రూపాయల జీతం అనటంతో అందరూ అవాక్కవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: