ఇదో వింత.. గ్రామమంత ఉండే దేశం గురించి మీకు తెలుసా?
సాధారణంగా ఒక దేశం అంటే ఎన్నో రాష్ట్రాలు ఇక ఆ రాష్ట్రాల్లో ఎన్నో మండలాలు నగరాలు గ్రామాలు ఉంటాయి. ఇలా ఏ దేశంలో అయినా సరే రాష్ట్రాలు ఉండటం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా ఒక దేశమే గ్రామం అంత చిన్నగా ఉండటం మీరు ఎప్పుడైనా విన్నారా. కానీ ఇక్కడ ఒక దేశం మాత్రం ఏకంగా గ్రామం అంత చిన్నగా ఉంది. అక్కడ ఉండే జనాభా కూడా ఒక చిన్న గ్రామంలో ఎంత ఉంటారో అంతే ఉండడం గమనార్హం. ఇలా గ్రామమంతా జనాభా, వైశాల్యం కలిగిన దేశం ఏదో కాదు వాటికన్ సిటీ.
ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న దిశగా కొనసాగుతుంది అని చెప్పాలి. 1929లో వాటికన్ సిటీ దేశంగా ఏర్పడింది. దీని వైశాల్యం దాదాపు నూట పది ఎకరాలు. ఇక ఈ దేశంలో ఉండే జనాభా వెయ్యి మంది మాత్రమే. ఇది రోమ్ నగరం మధ్యలో ఉన్న నగర రాజ్యం. అయితే ఈ దేశం పోప్ హోమ్ సిటీ కావడంతో ఇక ఈ దేశం సందర్శన కోసం ఏటా 50 లక్షలకు పైగా పర్యాటకులకు వచ్చి పోతూ ఉంటారు. ఇలా పర్యాటకులు వచ్చి పోవడం జరుగుతుంది కానీ అటు జనాభా మాత్రం ఎన్నో రోజుల నుంచి అతి తక్కువగా కొనసాగుతుంది అని తెలుస్తోంది. ఏదేమైనా గ్రామం లాంటి దేశం గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారూ.