రష్యా తెగించింది.. అక్కడ మోహరించింది?

praveen
నాటో దేశాలతో కలిసేందుకు సిద్ధమైన ఉక్రెయిన్ ను స్వాధీనం  చేసుకునేందుకు అటు రష్యా ఏం చేయడానికైనా రెడీ అనే విధంగానే ముందుకు సాగుతోంది. నాటో యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ విషయంలో రష్యాకు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ తగ్గేది లేదు అన్నట్లుగా ముందడుగు వేస్తున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్.  యుద్ధం చేసే ఉద్దేశం మాకు లేదు కానీ ఉక్రెయిన్ విషయంలో యూరోపియన్ యూనియన్ తీరు  మార్చుకోకపోతే మాత్రం యుద్ధం తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


 ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్షా 90వేల మంది సైనికులను రష్యా మోహరించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇరు దేశాల మధ్య ఉన్న బఫర్ జోన్ లోకి వచ్చి కొంత భాగాన్ని ఆక్రమించుకుంది రష్యా. అంతేకాదు ఇక ఉక్రెయిన్ ను అన్ని వైపుల నుంచి కూడా దాడి చేసేందుకు నాలుగు దిక్కుల నుంచి సైన్యాన్ని మోహరించింది. ఇక మరో రెండు మూడు రోజుల్లో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగే అవకాశం ఉందని అంచనా వేసింది అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం. దీంతో ఇదే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.



 అయితే ప్రస్తుతం రష్యా వ్యవహరిస్తున్న తీరు  అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు చెప్పినది నిజమే అని నమ్మేలా చేస్తున్నాయి. అయితే ఇక రష్యా యుద్ధానికి సిద్ధమైంది అని తెలుపుతూ ఇటీవలే కొన్ని ఛాయాచిత్రాలను విడుదల చేసింది అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం. ఇందులో చూసుకుంటే బెలారస్,  పశ్చిమ రష్యా లో అటు రష్యన్ సైనిక దళాలు కదం తొక్కుతున్నట్లు కనిపిస్తుంది. డోక్లాం క్రిమియా లాంటి చోట్ల భారీగా మిలిటరీ వాహనాలు సైనిక శిబిరాలను ఉన్నట్లు ఇక ఈ ఛాయా చిత్రాలు చెబుతున్నాయి.. ఉక్రెయిన్ సరిహద్దులకు కేవలం 25 వేల కిలోమీటర్ల దూరంలోనే రష్యా సైన్యం మొహరిస్తున్నట్లు  తెలుస్తోంది. ఇక ఇదంతా బయటపడడంతో ప్రస్తుతం అందరూ యుద్ధం తప్పదు అని ఫిక్స్ అయిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: