ఉక్రెయిన్ నుండి అందరూ వెనక్కి వచ్చేయండి.. బైడెన్ షాకింగ్ స్టేట్మెంట్?

praveen
ఉక్రెయిన్ రష్యా సరిహద్దు ప్రతిష్టంభన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. రానున్న రోజుల్లో ఏమి జరగబోతుంది సరిహద్దుల్లో నెలకొన్న సమస్య పరిష్కారం అవుతుందా.. లేకపోతే యుద్ధానికి దారితీస్తుంది అని ఎంతోమంది దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే చిన్న దేశమైన ఉక్రెయిన్ కి అగ్రరాజ్యమైన అమెరికా మద్దతు ఇస్తుంది. ఇక ఎవరి మద్దతు కూడగట్టుకున్నా ఉక్రెయిన్ విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదు అంటూ స్టేట్మెంట్ ఇస్తోంది. అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ చెబుతోంది.


 దీంతో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇటీవల కాలంలో ఉక్రెయిన్ అంశంపై రష్యా అమెరికా మధ్య వేడి మరింత పెరిగింది. దీంతో ఇక ఉక్రెయిన్ లో ఉన్న అమెరికా పౌరులు అందరూ కూడా వెనక్కి వచ్చేయాలి అంటూ బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే వీరిని వెనక్కి తీసుకు వచ్చేందుకు సైన్యాన్ని పంపడం కుదరదు అంటూ తేల్చి చెప్పింది. తమ సైన్యాన్ని పంపిస్తే అది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది అమెరికా. ఉక్రెయిన్లో పరిస్థితిలు రోజు రోజుకూ దిగజారి పోతున్నాయి. ఇక ఆ దేశంపై రష్యా ఎప్పుడైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందిన నేపథ్యంలో బైడెన్ తమ పౌరులను వెనక్కి తీసుకు వచ్చేందుకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.


 ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బైడెన్  ఇలా తమ పౌరుల వెనక్కి వచ్చేయాలి అంటూ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. మనం వ్యవహరిస్తున్నది ఉగ్రవాద సంస్థలతో కాదని... ప్రపంచం లోనే అతి పెద్ద సైనిక వ్యవస్థ కలిగిన రష్యాతో  అంటూ అమెరికా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక పరిస్థితులు శరవేగంగా మారవచ్చు అందుకే అందరూ వెనక్కి వచ్చేయాలి అంటూ వ్యాఖ్యానించింది. ఇక ఇదంతా చూస్తుంటే రానున్న రోజుల్లో ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మాత్రం తప్పదు అనే విధంగానే కనిపిస్తుంది పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: