రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. బైడెన్ కొత్త వ్యూహం?
తమకు ఉక్రెయిన్ తో యుద్ధం చేయాలని ఉద్దేశం అసలు లేదు అంటూ చెబుతుంది రష్యా. ఉక్రెయిన్ ను యూరోపియన్ యూనియన్ లో కలుపు కోబోము అంటూ మాకు మాటిస్తే మేము ఉక్రెయిన్ జోలికి వెళ్ళబోము అంటూ రష్యా చెబుతోంది. అయితే అలాంటి మాట ఇవ్వలేము అంటూ అటు యూరోపియన్ యూనియన్ నాటో దేశాలు చెబుతూ ఉన్నాయ్. ఇదే విషయం పైన ప్రస్తుతం సరిహద్దులో ప్రతి ష్టంభన కొనసాగుతోంది. అయితే రష్యాతో యుద్ధానికి మరింత మద్దతు కూడ గట్టేందుకు అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమం లోనే యుద్ధానికి ప్రారంభమైతే ఆయిల్ నిల్వలు ఎక్కువ మొత్తం లో అవసరం ఉంటాయి. కాబట్టి అరబ్ దేశాలతో చర్చలు జరిపేందుకు అమెరికా సిద్ధమైంది. కాగా అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అరబ్ దేశాల లో ఒకటైనా ఖాతార్ కు చెందిన ప్రతినిధిని వైట్ హౌస్ కి పిలిపించుకుని మరీ బైడెన్ చర్చలు జరిపారు ఇక ఈ సమావేశం కాస్త హాట్ టాపిక్ గా మారి పోయింది. రష్యా ఉక్రెయిన్ మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో మద్దతు కోసం అమెరికా ఇలాంటి చర్చలు జరిపినట్లు రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.