అమెరికా కి షాక్.. చైనా, రష్యా కలిసాయి?

praveen
నీది నాది ఒకే కథ అన్నట్లుగా అటు చైనాది రష్యాది కూడా ఒకే రకం పాలన. చైనా లో అసలు ఎన్నికల ఉండవు... తానే చైనాకు శాశ్వత అధ్యక్షుడిని అని జిన్పింగ్  ప్రకటించుకున్నారు.. రష్యాలో ఎన్నికలు ఉంటాయి కానీ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యేది మాత్రం పుతిన్. అంటే పైకి అందరినీ నమ్మించేందుకు మాత్రమే ఈ ఎన్నికలు అని ప్రపంచదేశాలకు తెలుసు. ఇక ఈ రెండు దేశాలు కూడా ఒకే భావజాలంతో ముందుకు సాగుతూ ఉంటాయి.. ఇప్పుడు రెండు దేశాలు కూడా మరోసారి చేతులు కలిపాయి అన్నది తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుండి పొరుగున ఉన్న తైవాన్ ను స్వాధీనం చేసుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు అనే చెప్పాలి.

తైవాన్ ను  స్వతంత్రదేశంగా గుర్తించలేమని తైవాన్ వన్ చైనా పాలసీని లో భాగమే అంటూ చైనా ఇప్పటికే ఎన్నో స్టేట్మెంట్ లు ఇచ్చింది. కానీ తాము స్వతంత్ర దేశంగానే కొనసాగుతున్నామని చైనా చెప్పుచేతుల్లో ఉండేందుకు సిద్ధంగా లేము అంటూ చిన్న దేశమైన తైవాన్ డ్రాగన్ దేశానికి ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో ఇక తైవాన్ ను స్వాధీనం చేసుకునేందుకు చైనా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇలాంటి సమయంలోనే అటు తైవాన్ కు మద్దతుగా అమెరికా సహా మరికొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో అటు రష్యా ఉక్రెయిన్ పై ఆధిపత్యం సాధించాలనుకుంటే నాటో, యూరోపియన్ యూనియన్ దేశాలు అడ్డుపడుతున్నాయి.

 ఇలాంటి క్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేయి కలిపారు అన్నది తెలుస్తుంది. ఇటీవలే వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు హాజరయ్యారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ క్రమంలోనే వన్ చైనా నినాదానికి మద్దతు ప్రకటించారు. తైవాన్  చైనాలో భూభాగమే అంటూ స్పష్టం చేశారు. అదే సమయంలో ఉక్రెయిన్ కు మద్దతుగా నాటో దళాలు యూరోపియన్ యూనియన్ మద్దతు పలకడం పై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఖండించారు. అమెరికా ప్రచ్ఛన్న యుద్ధ  విధానాలను వదిలి పెడితే మంచిది అంటూ సూచించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: