అమెరికా ఆయుధాలు పంపుతోంది.. ఇక ఉగ్రవాదులు ఖతం?
అచ్చంగా ఉక్రెయిన్ విషయం లో కూడా అమెరికా ఇదే విధంగా వ్యవహరించింది. యూరోపియన్ యూనియన్తో కలవడానికి సిద్ధమైన ఉక్రెయిన్ తమ అధీనం లోకి తెచ్చుకోవడానికి రష్యా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమం లోనే తాము ఉక్రెయిన్ కు మద్దతుగా ఉన్నామని ఆయుధాలను కూడా పంపిస్తాను అంటూ చెప్పింది అమెరికా. రష్యాతో పలుమార్లు సంప్రదింపులు కూడా జరగడం గమనార్హం. ఇక ఇప్పుడు మరో వివాదం లో కూడా కలగజేసుకుంది అన్నది అర్ధమవుతుంది. గత కొంత కాలం నుంచి సౌదీ అరేబియా హౌతి తీవ్రవాదుల మధ్య మినీ సాయిసైజ్ యుద్ధమే జరుగుతుంది.
ఒక వైపు నుంచి హౌతి తీవ్ర వాదులు ఏకంగా డ్రోన్లతో బాంబులు పేల్చడం మిస్సైల్ ప్రయోగించడం లాంటివి చేస్తుంటే.. మరోవైపు నుంచి సౌదీ అరేబియా యుద్ధ విమానాల తో హౌతో తీవ్ర వాదులను వెంటాడి వేటాడి చంపేస్తుంది. రానున్న రోజుల్లో సౌదీ అరేబియా హౌతి తీవ్ర వాదుల మధ్య యుద్ధం జరుగుతుంది అనుకుంటున్న సమయం లో ఇక సౌదీకి ఆయుధాలు ఇచ్చేందుకు సిద్దమయింది అమెరికా. ఎన్నో రకాల క్షిపణులను, బాంబర్లు యుద్ధ ట్యాంకులను కూడా సౌదీ అరేబియాకు పంపించేందుకు సిద్ధమయ్యాము అంటూ ఇటీవల అమెరికా స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది.