పాపం ఇమ్రాన్ ఖాన్.. చైనాలో ఘోర అవమానం?
ప్రపంచ దేశాలు అనుకోవడమే కాదు ఏకంగా పాకిస్థాన్ విషయంలో చైనా వ్యవహరించే తీరు కూడా ఇది చెప్పకనే చెబుతుంది. కానీ ఎందుకో ఈ విషయం పాక్ ప్రభుత్వానికి మాత్రం అసలు అర్థం కాదు.. ఇక ఇప్పుడు చైనా వ్యవహరించిన తీరు పాక్ ను చైనా ఎంత దారుణం గా వ్యవహరిస్తుంది అన్న దానికి నిదర్శనం గా మారిపోయింది. సాధారణంగా ఒక దేశ అధ్యక్షుడు ఇతర దేశాల్లో కి వెళ్ళినప్పుడు ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు. ఘన స్వాగతం పలుకుతుంటారు. ఒక దేశ అధ్యక్షుడు వెళ్తే ఆహ్వానం పలకడానికి ఆతిథ్య దేశ అధ్యక్షుడు రావడం చూస్తూ ఉంటాం.
కానీ ఇటీవలే పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన సమయంలో దారుణమైన అవమానమే జరిగింది అని చెప్పాలి. ఇమ్రాన్ ఖాన్ కు స్వాగతం పలికి ఆహ్వానించేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కాదు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వెళ్లడం గమనార్హం. దీన్నిబట్టే ఇక పాకిస్తాన్ ను చైనా ఎంత నీచంగా చూస్తోందని అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. కానీ ఇప్పటికే చైనా మాయలో పడిపోయిన ఇమ్రాన్ ఖాన్ కు మాత్రం ఇవన్నీ ఎక్కడా కనిపించవు అని చెప్పాలి.