చైనా వింత ప్రయోగం.. రోబో అమ్మ?
తన తుది శ్వాస వరకు బిడ్డల కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కల్మషం లేని ప్రేమ చూపిస్తూ ఉంటుంది. అందుకే తల్లి ప్రేమ ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు . కానీ అలాంటి తల్లి ప్రేమను కూడా కృత్రిమంగా మార్చేయాలని నిర్ణయించుకుంది చైనా. ఇక నుంచి బిడ్డకు తల్లి అవసరం లేకుండానే ఒక రోబోట్ అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ఒక సరికొత్త ప్రయోగానికి మొదలుపెట్టింది. ఇక చైనా మొదలుపెట్టిన ఈ వింత ప్రయోగం ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ల్యాబ్ లో తయారు చేసిన కృత్రిమ గర్భం లో పిండం దశ నుంచి బిడ్డ ఎదిగే వరకు అచ్చం తల్లి లాగానే ఎన్నో జాగ్రత్తలు తీసుకునేందుకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ని రూపొందించారు చైనా శాస్త్రవేత్తలు. ఇక ఈ రోబోట్ ఎప్పటికప్పుడు బిడ్డ కదలికలను జాగ్రత్తగా గమనిస్తూ అవసరమైన పోషకాలు అందించటం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం ఎలుకలపై ప్రయోగాలు జరుగుతున్నాయి అన్నది తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన ఎంతోమంది అమ్మ ప్రేమను కృతిమంగా మార్చడం ఏంటి.. చైనాకు బుద్ధి లేదా అని కామెంట్ లు పెడుతూ ఉండడం గమనార్హం.