కరోనాతో వణుకు.. చైనాలో 5 దారుణాలు?
ఈ క్రమంలోనే అన్ని దేశాల ప్రభుత్వాలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కరోనా వైరస్ ను నివారించడానికి ఆంక్షలను అమలులోకి తీసుకు వస్తున్నాయి. ఇలా కఠిన ఆంక్షలు విధించిన సమయంలో ప్రజా ప్రయోజనాలను కూడా దృష్టిలో తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు.. అయితే చైనా సృష్టించిన కరోనా వైరస్ ఇప్పుడు ఆ చైనాకే ముచ్చెమటలు పట్టిస్తోంది అన్నది అర్ధమవుతుంది. గత కొంత కాలం నుంచి చైనాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న నేపథ్యంలో ఇక అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అవుతూ ఎక్కడికక్కడ లాక్ డౌన్ విధిస్తూ ప్రజలను ఇంటికే పరిమితం చేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి.
అయితే కరోనా వైరస్ పెరిగిపోతున్న నేపథ్యంలో నియంత జిన్పింగ్ ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అన్న దానికి నిదర్శనంగా 5 విషయాలు ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
1. కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో లాక్ డౌన్ విధించి ప్రజలను ఇంటికే పరిమితం చేసినా ప్రభుత్వం కనీసం వారికి ఆహారాన్ని కూడా అందించకపోవడంతో ఎంతో మంది ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తూ గోడలు దూకి బయటకు వెళ్తున్నారట.
2. ఇలా కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిని అక్కడ పోలీసులు ఏకంగా తుపాకులు చూపించి నడిరోడ్డు పై మోకాళ్ళపై కూర్చోబెట్టి దారుణంగా చితకబాదుతూ ఉన్నారు అన్న విషయం కూడా బయటపడింది.
3. అంతేకాకుండా కుటుంబంలో ఎవరైనా వైరస్ బారిన పడితే కుటుంబంలోని పిల్లలను మెటల్ బాక్స్ లో బంధిస్తూ జైలు జీవితాన్ని గడిపే విధంగా చేస్తున్నారట.
4. ఇక పిల్లలు కరోనా వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో తల్లులుపిల్లలను వేరుచేస్తూ పిల్లలందరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
5.మరోవైపు స్కూల్ పిల్లలందరినీ కూడా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తుందట ప్రభుత్వం. ఎలా చైనాలో దారుణాలకు పాల్పడుతున్నారనే అయిదు విషయాలూ అంతర్జాతీయ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.