చైనా మాస్టర్ ప్లాన్.. పాక్ - రష్యా కలవబోతున్నాయ్?

praveen
గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా శత్రు దేశాల అన్నింటినీ కూడా ఒక్కతాటిపై నిలబెట్టి చైనాపై పోరాటం చేసేందుకు క్వాడ్ అనే కూటమిని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జపాన్ అమెరికా దేశాలు సభ్య దేశాలుగా కొనసాగాయ్. ఇక బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఈ కూటమికి పక్కన పెట్టేశారు. అయితే అచ్చం ఇలాగే ఇప్పుడు చైనా కూడా ఒక పెద్ద ప్లాన్ వేసింది అని అర్థమవుతుంది. అమెరికా వ్యతిరేక శక్తులన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకువచ్చి కూటమిగా ఏర్పడేలా చేయడానికి ప్లాన్ వేసింది అని అర్థమవుతుంది. అతి పెద్ద ఆర్థిక శక్తిగా ప్రపంచంలోనే నెంబర్వన్ గా ఎదిగేందుకు చైనా ఎన్నో రోజుల నుంచి కుట్రలు పన్నుతోంది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు దీని కోసం మరో పెద్ద ప్లాన్ వేసిందట చైనా. చైనాలోని బీజింగ్ లో జరగబోయే ఒలంపిక్స్ ను ఇప్పటికే ఎన్నో దేశాలు బహిష్కరించాయి. ఆస్ట్రేలియా జపాన్ అమెరికా లాంటి దేశాలు ఇక ఇలా బీజింగ్ లో జరిగే ఒలింపిక్స్ ను దౌత్య పరంగా బహిష్కరించడంతో చైనా కు షాక్ తగిలింది. గతంలో ఇదే విషయంపై చైనా అమెరికా దేశాలు పరస్పరం విమర్శలు చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఇక ఆయా దేశాలు బహిష్కరించిన బీజింగ్ ఒలంపిక్స్ వేదికగానే సరికొత్త కూటమికి చైనా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు.. పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ లను కూడా స్పెషల్ గెస్ట్ లుగా ఇన్వైట్ చేసిందట చైనా.

 అయితే ఇప్పటికే రష్యా పాకిస్తాన్ దేశాలు చైనా కు మిత్ర దేశాలు గా కొనసాగుతున్నాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదట బీజింగ్ ఒలంపిక్స్ ప్రారంభించడం ఇక ఆ తర్వాత అక్కడే రష్యా పాకిస్తాన్ స్నేహబంధం కుదిరే విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం లాంటి చేసేందుకు చైనా ప్లాన్ చేస్తుందట. తద్వారా ఇక అమెరికా వ్యతిరేక శక్తులు అందరిని కూడా ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు చైనా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి ఇక ఇప్పుడు దానిని అమలులో పెట్టేందుకు కూడా రెడీ అయిందని అంతర్జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: