ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనా.. చైనాలో అక్కడ లాక్ డౌన్?

praveen
మనదేశంలో భారీగా కేసులు పెరిగిపోతున్న సమయంలో ఇక ప్రభుత్వం కేసులను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ఎక్కడైనా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది అంటే ఇక ఎంతో మంది ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటారు. సామాన్యులను ఇబ్బందులకు గురి చేసేందుకే ప్రభుత్వం  ఇలాంటి ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చింది అంటూ విమర్శలు చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాని అటు చైనాలో మాత్రం కేవలం పదుల సంఖ్యలో కేసులు వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు.

 కరోనా వైరస్ ను పుట్టించి ప్రపంచ దేశాలను మొత్తం సంక్షోభంలోకి నెట్టిన చైనాకు.. కరోనా వైరస్ సృష్టించే  అల్లకల్లోలం గురించి అందరికంటే ఎక్కువ తెలుసు. అందుకే తక్కువ కేసులు ఉన్నప్పుడే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వస్తుంది చైనా ప్రభుత్వం. గత కొంత కాలం నుంచి చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఎన్నోప్రాంతాలలో కఠినమైన లాక్డౌన్ విధిస్తూ చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంచలనం గా మారిపోతున్నాయి. ఇలా కరోనా వైరస్ ను పుట్టించి  ప్రపంచ దేశాలలో అల్లకల్లోల సృష్టించిన చేయి చైనాకు ఎప్పుడూ అదే కరోనా ముచ్చెమటలు పట్టిస్తోంది.

 ఇటీవలే చైనాలోని తాంగ్ జాంగ్ నగరంలో 23 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంపై చైనా ప్రభుత్వం ఎంతో సీరియస్గా దృష్టి పెట్టింది.  ఇక ఆ నగరం మొత్తం లో కూడా మాస్ కోవిడ్ టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరు కూడా కరోనా వైరస్ పరీక్షలు చేసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఏకంగా 14 మిలియన్ల జనాభా ఉన్న ఆ నగరంపై  చైనా నిషేధం విధించింది. అక్కడికి ఎవరూ రాకపోకలు చేయడానికి అనుమతి లేదు అంటూ తేల్చి చెప్పింది. లాక్‌డౌన్‌ అమలులో ఉండటం కారణంగా ఎవరు ఇంటి నుంచి కాలు బయట పెట్టవద్దు అంటూ ఆంక్షలు విధించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: