చైనాకు చెక్.. ఘాతుక్ టీమ్ రంగంలోకి?

praveen
ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో రోజురోజుకూ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇక ఈ రెండు దేశాల మధ్య ఏ క్షణంలో యుద్ధం తలెత్తుతుంది అన్నది కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి. ప్రశాంతంగా ఉండే సరిహద్దుల్లో భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే కోరికతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించింది చైనా. తర్వాత భారత సైన్యం కూడా ఎదురు తిరగడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి. దీంతో గత కొన్ని నెలల నుంచి సరిహద్దుల్లో ఏర్పడిన ప్రతిష్టంభనను సమసిపోయేలా చేసేందుకు ఇరుదేశాల ఆర్మీ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. కానీ ప్రతిసారీ చర్చలు విఫలం అవుతూనే ఉన్నాయి.

 అదే సమయంలో గతంలో ఉద్రిక్త పరిస్థితుల సమయంలో భారత ఆర్మీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్న కొండ ప్రాంతాన్ని కైవసం చేసుకునేందుకు చైనా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరిస్తుంది అనే విషయం తెలిసిందే. అదే సమయంలో యుద్ధ విమానాలను కూడా మోహరిస్తుంది. ఇటీవలే పాంగాంగ్ సరస్సు దగ్గర సైనికులు అందరికీ మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూ వంతెన నిర్మాణం కూడాచైనా చేపట్టింది. ఏకంగా ఆ దేశ జెండాను ఎగరవేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదే సమయంలో అటు భారత ఆర్మీ కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది.


 ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా చైనా కు బదులు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది భారత ఆర్మీ. ఇటీవలే పాంగాంగ్ సరస్సు పై వంతెన నిర్మించి సైన్యాన్ని ఆయుధాలను మోహరించిన  నేపథ్యంలో ఇప్పటికే భారత సైన్యం కూడా సరిహద్దుల్లో మోహరించింది. అదే సమయంలో మూడు రకాలైనటువంటి సైన్యాన్ని సరిహద్దులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కొండమీదికి అలవోకగా ఎక్కే సామర్థ్యం కలిగినటువంటి మౌంటెన్  ఫోర్స్, బుమ్లా పాస్ దగ్గరికి ఆల్టిలరీ గన్స్ యూనిట్ ని కూడా చేర్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఘాతుక్ టీమ్ ను కూడా రంగంలోకి దించ పోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: