వామ్మో.. సైన్యమే ప్రజలను చంపుతుంది?

praveen
ప్రపంచ దేశాలు మొత్తం ప్రజాస్వామ్య పాలన తో ముందుకు సాగుతున్న వేళ కొన్ని దేశాలు మాత్రం నియంత పాలన వైపు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే చైనా రష్యా లాంటి దేశాలు ఎన్నికలతో సంబంధం లేకుండా పాలన సాగిస్తూ నియంత పాలన కొనసాగిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం చెప్పిందే వేదంగా ప్రస్తుతం ఆయా దేశాలలో పాలన సాగుతోంది. ఇప్పుడు మయన్మార్ లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్నది కూడా అర్థమవుతుంది. మొన్నటివరకు మయన్మార్లో ప్రజాస్వామ్యం పాలన జరిగేది. ప్రజలు ఎన్నుకున్న నాయకులు పాలన కొనసాగించేవారు. దీంతో అంతా సవ్యంగానే వుండేది.

 కానీ ఆ తర్వాత మాత్రం ఏకంగా సైన్యం తిరగబడింది. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని కూల్చేసి సైన్యమే పాలన చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే మయన్మార్ లో కూడా నియంత పాలన అమలులోకి వచ్చింది. సైన్యం ప్రజలను బానిసలుగా మార్చుకుంటూ రాక్షస పాలన సాగిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక సైన్యం పాలనతో ప్రజలు అందరూ కూడా భయాందోళనలో మునిగిపోతున్నారు. సైన్యం అమలు చేస్తున్న ఆంక్షలు నచ్చక ఎంతో మంది తిరుగుబాటు కూడా చేస్తూ ఉండటం గమనార్హం. అయితే ఇలా తిరుగుబాటు చేస్తున్న వారిపై  సైన్యం దారుణంగా వ్యవహరిస్తుంది తుపాకులతో కాల్చి చంపుతుంది.

 అంతటితో ఆగడం లేదు ఇక మయన్మార్లో సైన్యం చేస్తున్న దారుణాలు ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటికి మొన్న సైన్యం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్న వారిని దారుణంగా కాల్చి చంపిన సైనికులు.. ఇక ఇప్పుడు మరింత దారుణానికి పాల్పడ్డారు. ఇలా తిరుగుబాటు చేస్తున్న ఒక ప్రాంతాన్ని మొత్తం తగలబెడుతున్న విషయం ఇటీవల బయటపడింది . ఇలా తిరుగుబాటుదారులు ఉన్న ప్రాంతంలో అందర్నీ కాల్చి చంపుతూ ఇక వారిని అక్కడే తగలబెడుతూ అరాచకాలు సృష్టిస్తుంది మయన్మార్ సైన్యం. ఇలా  సైన్యం చూపిస్తున్న రాక్షసత్వం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: