వావ్: 25 ఏళ్ల కృషి.. వచ్చే వారంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం..!

N.ANJI

మనిషికి జిజ్ఞాస ఎక్కువ. ఆదిమ కాలం నుంచి విశ్వ రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. టెక్నాలజీ పెరిగినా మనిషిలో జిజ్ఞాస తగ్గలేదు. విశ్వంలో ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడానికి టెలిస్కోపులను తయారు చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతిపెద్ద టెలిస్కోపును నిర్మించారు. ఇంత వరకు విశ్వ రహస్యాలు అందిస్తూ వస్తున్న ‘హబుల్ టెలిస్కోపు’నకు ఇది వారసురాలిగా.. జేమ్స్ వెబ్ టెలిస్కోపు ప్రయోగం చేయనున్నారు. ఈ ప్రయోగం ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానుంది. అయితే ఈ టెలిస్కోపు నిర్మాణం.. ప్రయోగంపై పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.   


కెనడా స్పెస్ ఏజెన్సీ, యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తాధ్వర్యంలో నాసా ఈ టెలిస్కోపును అభివృద్ధి చేసింది. దాదాపు ఇరవైకి పైగా దేశాలు ఈ టెలిస్కోపు నిర్మాణంలో భాగస్వామ్యమైంది. ఏరియన్ 5 స్పేస్ రాకెట్ సాయంతో ఫ్రెంచ్ గినియాలోని గినియా స్పేస్ సెంటర్ నుంచి ఈ టెలిస్కోపును అంతరిక్షంలోకి పంపించనున్నారు. ఈ టెలిస్కోపు నిర్మాణంలో దాదాపు 10 వేల మంది పరిశోధకులు, 4 కోట్ల పని గంటల శ్రమ దాగి ఉంది. 1996లో ఈ టెలిస్కోపు ప్రాజెక్టును ప్రారంభించారు. 2002లో దీన్ని ‘జేమ్స్ వెబ్’ పేరును పెట్టారు. 25 ఏళ్ల కృషి తర్వాత 2021లో టెలిస్కోపు సిద్ధమైంది.


ఈ టెలిస్కోపు నిర్మాణం సుదీర్ఘకాలం కొనసాగడంతో చాలా నిధులు వెచ్చించడం జరిగింది. దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.50 కోట్ల డాలర్లు కాగా.. 2021లో రూ.1000 కోట్ల డాలర్ల వ్యయమైంది. అంటే దాదాపు రూ.76,000 వేల కోట్ల. ఈ నెల 22వ తేదీన పరిశోధకులు ప్రయోగం చేయనున్నారు. దీన్ని భూమి, సూర్యడి మధ్యలో ఉన్న ఎల్2 లాంగ్రేజియన్ బిందువు వద్దకు పంపనున్నారు. ఈ బిందువు భూమికి 15 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఈ టెలిస్కోపు భూమిలా సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. కక్ష్యలో చేరాక ఇది రోజుకు 458 గిగా బైట్లను 10 ఏళ్ల పాటు పంపనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: