అమెరికన్ తెలుగు అసోసియేషన్..ఏం సాయం చేశారో తెలుసా..?

MOHAN BABU
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తన గొప్పతనాన్ని చాటుకుంది. అమెరికా లో గాయపడ్డ తెలుగు విద్యార్థులకు సాయం అందించింది. అయితే అమెరికాలో కలీట్టికట్ రాష్ట్రంలోని సీక్రెడ్ హాట్ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అమెరికాలోని ఆస్పత్రిలో  హెల్త్ ఇన్సూరెన్స్, ఉద్యోగం లేకున్నా వైద్యం చేయించుకోవాలంటే భారీగా ఖర్చవుతుంది. అంతేకాక వైద్య బీమా లేని సందర్భాల్లో ఆస్పత్రులు సైతం వైద్యం అందించడానికి సుముఖత చూపించావు. ఇలాంటి సమయంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ గాయపడిన విద్యార్థుల విషయం తెలుసుకొని వెంటనే వాళ్ళతో మాట్లాడి వాళ్లకు మేమున్నామన్న భరోసా ఇచ్చి డాక్టర్ తో మాట్లాడి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వాళ్లకు కావాల్సిన సహకారం అందించడానికి ముందుకు వచ్చారు.

ఈ ఇద్దరు విద్యార్థులకు అమెరికాలో తెలిసిన వాళ్ళు లేకపోవడం, ఆస్పత్రి చికిత్స సమయంలో సహాయకులు లేక ఇబ్బందులు పడడం, అలాగే హాస్పిటల్ ఖర్చులు కూడా అధికమవుతుండడంతో ఆస్పత్రి వర్గాలు, వైద్యులు సైతం ఇండియా వెళ్లి అక్కడ ఫిజికల్ థెరపీ చేయించుకోమని సలహా ఇచ్చారు. అయితే విద్యార్థులు ప్రస్తుత పరిస్థితుల్లో క్షేమంగా విమాన ప్రయాణం చేయాలంటే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బిజినెస్ క్లాస్ టికెట్స్ తో మాత్రమే ప్రయాణం చేయాలని వైద్యులు సూచించారు. కానీ విద్యార్థుల దగ్గర అంత డబ్బు లేకపోవడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారికి కావలసిన డబ్బు 15000 డాలర్లు సమకూర్చి ఆ ఇద్దరు విద్యార్థులకు బిజినెస్ క్లాస్ టికెట్ లను తీసుకొని క్షేమంగా హైదరాబాద్ కు పంపించారు. వారు పూర్తిగా కోలుకున్నాక మళ్లీ అమెరికా తిరిగి వచ్చి వాళ్ల చదువులు కొనసాగించేలా అధికారులతోనూ మాట్లాడారు. అంతేకాకుండా తిరుగు ప్రయాణం టికెట్లు కూడా కొనిచ్చారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కమ్యూనిటీ సర్వీసెస్ విభాగం అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లందరికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకు ఎనలేని సేవలందిస్తోందని, పరిధి మేరకు సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటోందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: